Page Loader
ఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ 
ఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ

ఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ 

వ్రాసిన వారు Stalin
Jun 05, 2023
09:56 am

ఈ వార్తాకథనం ఏంటి

ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటనపై రాజకీయ దుమారం రేగడంతో రైల్వే మంత్రిత్వ శాఖ సీబీఐ విచారణకు సిఫార్సు చేసింది. ఈ మేరకు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. 'ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్'లో వచ్చిన మార్పు వల్లే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైందని, ఈ క్రమంలో దాని ఇంజిన్, కోచ్‌లు లూప్ లైన్‌లలో ఒకదానిపై ఒకటి పడిపోయినట్లు మంత్రి ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలో లూప్‌లైన్ మార్గంలో వచ్చిన గూడ్స్ రైలు ట్రాక్‌పై పడి ఉన్న కోచ్‌లను ఢీకొట్టినట్లు మంత్రి వెల్లడించారు. దీని వల్ల కోరమాండల్ కోచ్‌లు మూడో ట్రాక్‌లోకి వెళ్లడంతో, అధికవేగంతో వస్తున్న బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ వాటిని ఢీకొట్టినట్లు రైల్వేశాఖ తెలిపింది.

రైలు

భద్రతా చర్యలు లేకపోవడంపై ప్రతిపక్షాల విమర్శలు

మూడు రైళ్లు ఢీకొన్ని మార్గంలో దేశీయంగా అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ "కవాచ్" కూడా అందుబాటులో లేదు. ఇది అమల్లో ఉన్నా కూడా ఇలాంటి ప్రమాదాన్ని నివారించడంలో ఈ వ్యవస్థ ఉపయోగపడేది కాదని రైల్వే అధికారి ఒకరు చెప్పారు. రైలు భద్రతలో అనేక తీవ్రమైన లోపాలతో కూడిన రైల్వే ఆడిట్ నివేదికను గతేడాది సెప్టెంబర్‌లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. అయితే ఆ లోపాలను సవరించడంలో విఫలమైనందు వల్లే ఇప్పుడు ఇంతపెద్ద రైలు ప్రమాదం జరిగిందని రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. భద్రతా చర్యలు లేకపోవడంపై ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో రాజకీయ దుమారం రేగింది. రైళ్లలో యాంటీ-కాల్షన్ సిస్టమ్‌ను అమర్చినట్లయితే ప్రమాదాన్ని నివారించవచ్చని గతంలో రైల్వేమంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీ పేర్కొన్నారు.

రైలు

సీబీఐ పని నేరాలను పరిశోధించడమే: తృణమూల్ 

ఈ ప్రమాదంలో సీబీఐ విచారణకు సిఫార్సు చేయడంపై కూడా రాజకీయ ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. సీబీఐ పని నేరాలను పరిశోధించడమే అని, రైల్వే ప్రమాదాలు, లోపాల గురించి కాదని తృణమూల్ ప్రతినిధి సాకేత్ గోఖలే ట్వీట్ చేశారు. రైల్వే మంత్రిని రక్షించడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నం ఇదన్నారు. ఇదిలా ఉంటే, ఒడిశా ప్రభుత్వం ప్రమాదంలో మరణాల సంఖ్యను సవరించింది. సంఖ్యను 288 నుంచి 275కి తగ్గించింది. గాయపడిన వారి సంఖ్యను 1,175గా ఉంచింది. దేశంలో ఇది మూడో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం అని గణాంకాలు సూచిస్తున్నాయి.