ప్రయాగ్‌రాజ్ మహాకుంభ మేళాకు రైల్వేశాఖ రెఢీ.. 800 ప్రత్యేక రైళ్లు కేటాయింపు
భారతదేశంలోనే అటు జనాభా పరంగా, ఇటు వైశాల్యం పరంగా అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. నాలుగేళ్లకోసారి (పవిత్ర స్నానాల పండగ) కుంభమేళాను యూపీలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అయితే 2025లో ప్రయాగ్ రాజ్ కుంభమేళా జరగనుంది. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను కేటాయించేందుకు సిద్ధమవుతోంది. స్నానాల పండగ కోసమే దేశ నలుమూలల నుంచి తరలివచ్చే కోట్లాది భక్తుల కోసం స్పెషల్ గా 800 రైళ్లను నడిపేందుకు కృషి చేస్తోంది. ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నతాధికారులతో కీలక మీటింగ్ నిర్వహించారు. స్టేషన్లలో ఎలాంటి ఏర్పాట్లను చేయాలనే అంశం నుంచి రైళ్ల ప్రస్తుత స్థితిగతుల వరకు సమీక్ష చేశారు.
అన్ని ఏర్పాట్లకు రైల్వే మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్
మహాకుంభమేళాకు నార్తర్న్ సెంట్రల్ రైల్వే నోడల్‌గా మారనుంది. ప్రయాగ్‌రాజ్‌లోని నార్తర్న్ రైల్వే, నార్త్ ఈస్టర్న్ రైల్వేలు ఏర్పాట్లు చేస్తోంది. ఈ దఫా 2025లో జరిగే కుంభమేళాకు సుమారు 15 కోట్ల మందికిపైగా భక్తులు తరలివస్తారని భావిస్తున్నారు. యాత్రికులకు రవాణా సౌకర్యం కోసం NCR,NR 9 రైల్వే స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. మేళా కోసం రూ.837 కోట్ల బడ్జెట్‌తో ఆర్‌ఓబీ, ఆర్‌యూబీలు నిర్మిస్తున్నారు. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం లభించింది. భక్తుల రద్దీ నేపథ్యంలో రైల్వే స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేస్తోంది. రైల్వే అధికారులు, ఉద్యోగులు దిల్లీ కంట్రోల్ రూమ్ నుంచి 24 గంటల పాటు రైళ్లను పర్యవేక్షించనున్నారు.