Page Loader
Delhi rains: దిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు.. 180కి పైగా విమానాలపై ప్రభావం
దిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు.. 180కి పైగా విమానాలపై ప్రభావం

Delhi rains: దిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు.. 180కి పైగా విమానాలపై ప్రభావం

వ్రాసిన వారు Sirish Praharaju
May 26, 2025
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షాలు నగరాన్ని ముంచెత్తాయి. వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయినట్లు సమాచారం. ముఖ్యంగా దిల్లీ కంటోన్మెంట్‌,ధౌలా కువాన్‌,సుబ్రతో పార్క్‌,నానక్‌పుర ప్రాంతాలు పూర్తిగా నీటితో నిండిపోయాయి. వర్ష ప్రభావం విమాన రాకపోకలపై తీవ్రంగా పడింది.ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 17అంతర్జాతీయ విమానాలతో సహా మొత్తం 49విమానాలను ప్రత్యామ్నాయ దారులకే మళ్లించాల్సి వచ్చింది. మొత్తం 180కు పైగా విమానాల రాకపోకలపై ప్రభావం చూపినట్టు అధికారులు తెలిపారు. విమానాశ్రయం టెర్మినల్-1 వద్ద ఒక భాగం పాక్షికంగా దెబ్బతినడంతో,పైకప్పు నుంచి ఒక్కసారిగా నీరు ప్రవహిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అయ్యాయి.

వివరాలు 

కేరళలో వర్షాలు - ఈదురుగాలులతో అల్లకల్లోలం 

ఆదివారం కేరళ రాష్ట్రంలో వర్షాలు, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. త్రిశూర్ జిల్లాలోని చిరుతుర్తి రైల్వే బ్రిడ్జి సమీపంలో ఓ కదులుతున్న రైలుపై పెద్ద చెట్టు విరిగిపడింది. అప్రమత్తమైన లోకోపైలెట్ రైలును వెంటనే నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి అధికారులు స్పందిస్తూ - భారీ ప్రమాదం జరగకుండా తప్పించగలిగామని వెల్లడించారు.