
చంద్రయాన్-3 వ్యోమగాములకు శుభాకాంక్షలు చెప్పిన రాజస్థాన్ మంత్రి.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
ఈ వార్తాకథనం ఏంటి
చంద్రయాన్-3పై రాజస్థాన్ మంత్రి అశోక్ చందన్ నోరు జారారు. ఈ మేరకు ప్రాజెక్టు విజయవంతంపై ఆయన స్పందించారు. ఈ క్రమంలోనే ఇస్రోకు అభినందనలు తెలియజేశారు.
ఇంతవరకు బాగానే ఉన్నా, మిషన్‌లో ప్రయాణించిన వ్యోమగాములకు తాను సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నివ్వెరపోయారు.
సదరు మంత్రి ఏం మాట్లాడుతున్నారో, దేని గురించి చెబుతున్నారో ఎవరికీ అర్థం కాలేదు.
ఓ వైపు ప్రయోగం గురించి, ఇస్రో పనితీరుపై వివిధ రంగాల నిపుణులు, విద్యార్థులు,సామాన్యులు ఎంతో ఆసక్తి కనబర్చారు.
అలాంటిది రాజస్థాన్ క్రీడాశాఖ మంత్రిగా అశోక్ చందన్‌కు దీనిపై కనీస అవగాహన లేకపోవడంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
చంద్రయాన్-3 మానవ రహిత మిషన్ అన్న కనీస విషయం మంత్రికి తెలియకపోవడంపై నెట్టింట చురకలంటిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వ్యోమగాములకు సెల్యూట్ అంటున్న మంత్రి అశోక్ చందన్
Gems of Congress 🙏🏻
— Shirish Thorat (@shirishthorat) August 23, 2023
"I salute the passengers who went in Chandrayaan"
Ashok Chandna, Sports Minister, Government of Rajasthan pic.twitter.com/0WXHqtjxAL