Page Loader
రాజీవ్ గాంధీ వర్ధంతి: సోనియా, ఖర్గే, ప్రియాంక నివాళి; రాహుల్ భావోద్వేగ ట్వీట్ 
రాజీవ్ గాంధీ వర్ధంతి: సోనియా, ఖర్గే, ప్రియాంక నివాళి; రాహుల్ భావోద్వేగ ట్వీట్

రాజీవ్ గాంధీ వర్ధంతి: సోనియా, ఖర్గే, ప్రియాంక నివాళి; రాహుల్ భావోద్వేగ ట్వీట్ 

వ్రాసిన వారు Stalin
May 21, 2023
12:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం దిల్లీలోని వీర్ భూమిలో నివాళులర్పించారు. మే 21, 1991న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టిటిఇ) చేసిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీ చనిపోయారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తండ్రిని తలుచుకుంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు. పాపా మీరు నాతో, జ్ఞాపకాల్లో ఎల్లప్పుడూ ఉంటారని ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం రాజీవ్ గాంధీ సందర్భంగా ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోనియా గాంధీ, ఖర్గే రాజీవ్ గాంధీకి నివాళి

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాహుల్ గాంధీ భావోద్వేగ ట్వీట్

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రధాని మోదీ చేసిన ట్వీట్