Page Loader
Ram Mohan Naidu: ఆసియా-పసిఫిక్‌ ఛైర్మన్‌గా రామ్మోహన్‌నాయుడు ఏకగ్రీవ ఎన్నిక
ఆసియా-పసిఫిక్‌ ఛైర్మన్‌గా రామ్మోహన్‌నాయుడు ఏకగ్రీవ ఎన్నిక

Ram Mohan Naidu: ఆసియా-పసిఫిక్‌ ఛైర్మన్‌గా రామ్మోహన్‌నాయుడు ఏకగ్రీవ ఎన్నిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 12, 2024
09:13 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆసియా-పసిఫిక్‌ దేశాల ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక దిల్లీలో రెండవ ఆసియా-పసిఫిక్‌ మంత్రుల స్థాయి సదస్సులో బుధవారం నిర్వహించారు. రామ్మోహన్‌నాయుడి పేరును సింగపూర్‌ ప్రతిపాదించగా, భూటాన్‌ ఆ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చింది. ఇక ఇతర సభ్యదేశాల సమ్మతితో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ గౌరవాన్ని దేశం తరఫున స్వీకరిస్తానని, దీనిని ఒక కీలక బాధ్యతగా భావిస్తున్నానని రామ్మోహన్‌నాయుడు తెలిపారు. సాధారణ ప్రజలకు విమానయాన సేవలను మరింత చేరువ చేయడం, అలాగే ఆసియా-పసిఫిక్‌ ప్రాంతీయ దేశాల మధ్య రాకపోకలను సులభతరం చేయడం కోసం తనవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.