NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Central Tax Share: కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద తెలంగాణకు రూ.3,745 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,211 కోట్లు
    తదుపరి వార్తా కథనం
    Central Tax Share: కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద తెలంగాణకు రూ.3,745 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,211 కోట్లు
    కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద తెలంగాణకు రూ.3,745 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,211 కోట్లు

    Central Tax Share: కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద తెలంగాణకు రూ.3,745 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,211 కోట్లు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 11, 2024
    09:44 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర పన్నుల్లో వాటా కింద ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి రూ. 7,211 కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి రూ. 3,745 కోట్లు కేంద్ర ప్ర‌భుత్వం గురువారం విడుదల చేసింది.

    అక్టోబర్ నెలకు సంబంధించి రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసినట్లు తెలియజేసింది.

    దేశంలోని 28 రాష్ట్రాలకు గాను మొత్తం రూ. 1,78,173 కోట్లను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది.

    అక్టోబర్ నెల పన్నుల వాటా కింద రాష్ట్రాలకు కేంద్రం రూ. 89,087 కోట్లను విడుదల చేసింది. దసరా, దీపావళి సందర్భంగా మూలధన వ్యయాన్ని వేగవంతం చేసే ఉద్దేశంతో అడ్వాన్స్ ఇనిస్టాల్మెంట్ కింద రూ. 89,086 కోట్లను కలిపి విడుదల చేసినట్లు వివరించింది.

    వివరాలు 

    మూడు రాష్ట్రాల‌కు మాత్ర‌మే రూ. 1,000 కోట్ల లోపు విడుదల

    పన్నుల వాటాలో ఉత్త‌ర ప్ర‌దేశ్‌కి అత్యధికంగా రూ. 31,962 కోట్లు విడుదల చేయగా, ఆ త‌రువాత బిహార్ రూ. 17,921 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ. 13,987 కోట్లు, ప‌శ్చిమ బెంగాల్‌కు రూ. 13,404 కోట్లు కేటాయించినట్టు తెలిపింది.

    అత్యల్పంగా గోవాకు రూ. 688 కోట్లు, సిక్కింకు రూ. 691 కోట్లు, మిజోరంకు రూ. 891 కోట్లు ప‌న్నుల వాట కింద విడుదల చేసింది.

    ఈ మూడు రాష్ట్రాల‌కు మాత్ర‌మే రూ. 1,000 కోట్ల లోపు విడుదల చేసినట్టు వివరించింది.

    నిబంధనల ప్రకారం, ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో 14 వాయిదాల్లో కేంద్ర పన్నుల వాటాను రాష్ట్రాలకు పంపిణీ చేయవచ్చని స్పష్టం చేసింది.

    వివరాలు 

    పన్ను వాటాను 50 శాతానికి పెంచాలి 

    కాగా, 11 నెలల్లో పదకొండు వాయిదాలతో పాటు మార్చిలో మూడుసార్లు పన్నుల వాటాను విడుదల చేసినట్లు తెలియజేసింది.

    పండగల సీజన్‌లో అభివృద్ధి, సంక్షేమ సంబంధిత వ్యయాలకు ఆర్థిక సాయం చేయాలన్న ఉద్దేశంతోనే అడ్వాన్స్ ఇనిస్టాల్మెంట్‌ను పంపిణీ చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

    అయితే, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 50 శాతానికి పెంచాలని తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, కేర‌ళతో పాటు పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి.

    ఇటీవల తెలంగాణకు వచ్చిన 16వ ఫైనాన్స్ కమిషన్‌కు ఈ సమస్యలను ప్రభుత్వం వివరించింది.

    కేంద్ర పన్నుల వాటాను 50 శాతం పెంచాలని ప్రతిపాదన పెట్టింది. అలాగే, జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు.

    వివరాలు 

    కేంద్రం నుంచి వాటా భారీగా తగ్గుతోందని రాష్ట్రాలు ఆందోళన 

    వాస్తవానికి, 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల ప్రకారం, కేంద్ర పన్నుల్లో 41 శాతం రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంటుంది.

    అయితే, 2024 ఫైనాన్షియల్ ఈయర్‌లో 32.5 శాతం కేంద్ర పన్నులను రాష్ట్రాలతో పంచుకోవాలని ఆర్థిక శాఖ అంచనా వేసింది.

    ఈ సెస్, సర్ చార్జీలలో కేంద్రం నుంచి వాటా భారీగా తగ్గుతోందని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ
    ఆర్థిక శాఖ మంత్రి

    తాజా

    Nirav Modi: యూకే హైకోర్టులో నీర‌వ్ మోదీకి షాక్‌.. బెయిల్ పిటిష‌న్ కొట్టివేత‌ యునైటెడ్ కింగ్డమ్
    Saraswati Pushkaralu: కాళేశ్వరం అభివృద్ధికి రూ.200 కోట్ల నిధులు: రేవంత్ రెడ్డి  తెలంగాణ
    S Jaishankar: చరిత్రలో మొదటిసారి.. తాలిబన్‌ విదేశాంగ మంత్రితో జైశంకర్‌ కీలక చర్చలు  భారతదేశం
    Andhra News: ఏపీలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా.. మార్గదర్శకాలు విడుదల ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    Praksam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ పూర్తి ప్రకాశం జిల్లా
    Sonusood: చంద్రబాబు పాలనలో ప్రజలు సురక్షితంగా ఉన్నారు : సోనుసూద్  చంద్రబాబు నాయుడు
    Andhrapradesh: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. భవన నిర్మాణ అనుమతులకు సింగిల్‌ విండో విధానం ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్
    R. Krishnaiah: బీజేపీలోకి వైసీపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య..? బీజేపీ

    తెలంగాణ

    Telangana: అన్నదాతకు గుడ్ న్యూస్.. రైతు భరోసాపై కీలక అప్డేట్ భారతదేశం
    Telangana: హరిత ఇంధన ఉత్పత్తి, వినియోగానికి తెలంగాణలో పుష్కలంగా అవకాశాలు.. ఎంఎన్‌ఆర్‌ఈ వెల్లడి భారతదేశం
    Hydra: చెరువుల రక్షణకు 'హైడ్రా' పక్కా ప్రణాళిక.. 45 ఏళ్ల నాటి చిత్రాల సేకరణ హైదరాబాద్
    Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ  ఇండియా

    ఆర్థిక శాఖ మంత్రి

    కరోనా BF.7 వేరియంట్ సోకిన వారికి అక్కడ ఉచితంగా చికిత్స కోవిడ్
    బడ్జెట్ 2023: మధ్యతరగతి వర్గంపై కొత్త పన్నులు విధంచలేదు: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
    ఆర్థిక సర్వే 2023: బడ్జెట్ వేళ ఆర్థిక సర్వే ప్రాముఖ్యతను తెలుసుకోండి బడ్జెట్
    ఆర్థిక సర్వే: 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6.5శాతం వృద్ధి నమోదు ఆర్థిక సర్వే
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025