Page Loader
Revanth Reddy: నేడు దిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ?
నేడు దిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ?

Revanth Reddy: నేడు దిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ?

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 18, 2025
02:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు దిల్లీకి వెళ్లే అవకాశమున్నట్లు సమాచారం. ఆయన రెండు రోజుల పాటు అక్కడ పర్యటించనున్నట్లు సమాచారం. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలను సీఎం రేవంత్ కలిసే అవకాశం ఉందని తెలిసింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు వివిధ కార్పొరేషన్లకు ఛైర్మన్ల ఎంపికపై వారికి సమాచారం ఇచ్చి, ఈ అంశాలపై చర్చించే అవకాశముందని తెలుస్తోంది. అదే సమయంలో, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులను కూడా ముఖ్యమంత్రి కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ సమావేశాల్లో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.