తదుపరి వార్తా కథనం

Bhadrachalam: భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
వ్రాసిన వారు
Sirish Praharaju
Jul 24, 2025
12:59 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న వర్షాలు,ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద ప్రవాహం కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం స్థిరంగా పెరుగుతోంది. ఈ రోజు ఉదయం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 21 అడుగులకు చేరుకుంది. నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల వద్ద ఉన్న నార చీరల ప్రాంతం వరద నీటితో మునిగిపోయింది. సీత వాగులోకి నీరు చేరిన కారణంగా, అక్కడికి పర్యాటకుల రాకను అధికారులు తాత్కాలికంగా నిలిపేశారు. అదేవిధంగా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టులోకి కూడా వరద నీరు భారీగా చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుండి వరద కొనసాగుతున్న నేపథ్యంలో నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశముందని సంబంధిత అధికారులు హెచ్చరిస్తున్నారు.