Page Loader
Bihar: బీహార్ ఓటర్ల జాబితాలను సవరించాలన్న నిర్ణయం..ప్రతిపక్షాల నిరసన
బీహార్ ఓటర్ల జాబితాలను సవరించాలన్న నిర్ణయం..ప్రతిపక్షాల నిరసన

Bihar: బీహార్ ఓటర్ల జాబితాలను సవరించాలన్న నిర్ణయం..ప్రతిపక్షాల నిరసన

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 09, 2025
10:32 am

ఈ వార్తాకథనం ఏంటి

ఓటర్ల జాబితా సవరణపై కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన చర్యలతో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త కార్మిక నియమావళి వ్యతిరేకంగా బిహార్‌లో నిరసనలు ఉధృతంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన 10 ప్రధాన కార్మిక సంఘాలు చురుకుగా పాల్గొంటున్నాయి. పట్నాలో ఎన్నికల కమిషన్ రూపొందించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్‌) ఎన్నికల జాబితాకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ నిరసనల్లో రాహుల్ గాంధీ కూడా పాల్గొంటున్నారు. లంబార్‌లోని ఆదాయపు పన్ను కార్యాలయం నుంచి ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు జరిగే ప్రదర్శనల్లో ఆయన పాల్గొంటారు. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.హాజీపూర్‌, సోన్‌పూర్‌ వంటి ప్రాంతాల్లో పోలీసుల సమక్షంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి.

వివరాలు 

ప్రధాన రహదారులను దిగ్బంధం 

ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా ఆర్జేడీతో పాటు మహాఘటబంధన్‌కు చెందిన ఇతర పార్టీల నేతలు బీహార్‌ రోడ్లపైకి వచ్చి నిరసనల్ని నిర్వహిస్తున్నారు. నిరసనకారులు రోడ్లపై టైర్లు దహనం చేస్తూ,ప్రధాన రహదారులను దిగ్బంధనం చేస్తున్నారు. జెహానాబాద్‌లో ఆర్జేడీ విద్యార్థి విభాగం సభ్యులు రైల్వే ట్రాక్‌లపై దిగుతూ నిరసన తెలిపారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ,బీహార్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్‌లు కలిసి, ఓటర్ల జాబితా సవరణపై కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు.

వివరాలు 

బీహార్ అంతటా నిరసనలు 

అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త కార్మిక నియమావళికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాలకు కూడా వీరిద్దరూ నాయకత్వం వహిస్తున్నారు. ఈ నిరసనలకు ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, బీహార్ మొత్తం విస్తృతంగా నిరసనలతో ఊగిపోతుందని వ్యాఖ్యానించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సచివాలయ్ హాల్ట్ స్టేషన్ వద్ద రైల్వే ట్రాక్‌ను దిగ్బంధించిన  కాంగ్రెస్ కార్యకర్తలు