తదుపరి వార్తా కథనం

Putin India Visit: త్వరలో భారత పర్యటనకు రానున్న పుతిన్..!
వ్రాసిన వారు
Sirish Praharaju
Aug 07, 2025
03:56 pm
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్‌ను సందర్శించనున్నట్టు సమాచారం. ఈ నెల చివర్లో ఆయన భారత పర్యటనపై నిర్ణయం తీసుకోనున్నట్టు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే, పర్యటనకు సంబంధించిన ఖచ్చితమైన తేదీలు ఇంకా నిర్ణయించాల్సి ఉందని ఆయన చెప్పినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతానికి అజిత్ దోవల్ రష్యా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో, రష్యా నుంచి చమురు దిగుమతులపై భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల సమయంలో ఈ ప్రకటన ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
త్వరలో భారత పర్యటనకు రానున్న పుతిన్..!
#NewsAlert | Russian President Putin is expected to visit India in late August - NSA Ajit Doval announced#VladimirPutin #Russia #AjitDoval pic.twitter.com/hKKK3AZGGX
— ET NOW (@ETNOWlive) August 7, 2025