S Jaishankar: నేడు అమెరికాకు కేంద్రమంత్రి జైశంకర్.. ట్రంప్‌తో భేటీ అయ్యే అవకాశం ..?
విదేశాంగ మంత్రి జై శంకర్ మంగళవారం అమెరికా పర్యటనకు బయలుదేరారు. ఆరు రోజుల పాటు, అంటే సెప్టెంబర్ 24 నుండి 29 వరకు జరగనున్న ఈ పర్యటనలో ఆయన భారత కాన్సల్ జనరల్స్ సమావేశంలో పాల్గొంటారు. అలాగే, అమెరికా విదేశాంగ మంత్రితో కలిసి ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కీలక చర్చలు జరుపుతారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జై శంకర్ చేపట్టిన మొదటి పర్యటన ఇది . అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా, రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని జై శంకర్ గతంలో వ్యాఖ్యానించారు.