Bangladesh Violence: బంగ్లాకు అండగా నిలవాలి.. లేదంటే మనది మహా భారత్ కాదు : సద్గురు
బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనపై ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్నిక గురువు సద్గురు జగ్గీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బంగ్లాదేశ్ లో హిందువులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌ను రక్షించుకోవడం మన బాధ్యత అని తెలిపారు. పొరుగునున్న మైనార్టీల భద్రత కోసం సాధ్యమైనంత త్వరగా చర్యలు చేపట్టాలని సద్గురు కోరారు. ఇప్పటికే హిందూ ఇళ్ళు, వ్యాపార సంస్థలపై అల్లరిమూకలు దాడులు పాల్పడుతూ, విలువైన వస్తువులను కూడా దోచుకున్నారని స్థానిక మీడియా పేర్కొంది.
అఖండ భారత్ రణరంగంగా మారడం బాధాకరం
బంగ్లా అల్లర్లు ఆ దేశానికే పరిమితం కాదు. ఒకప్పటి అఖండ భారత్ ఇప్పుడు రణరంగంగా మారడం భాదేస్తోంది. బంగ్లాకు మనం అండగా నిలవాలి. లేదంటే మనది మహా భారత్ కానే కాదని సద్గురు ట్వీట్ చేశారు. మరోవైపు భారతదేశంలో కూడా కొంతమంది వ్యక్తులు కులం, మతం రిజర్వేషన్లపై సమస్యలను రేకెత్తిస్తూ అశాంతిని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని పతంజలి ఆయుర్వేద సహ వ్యవస్థాపకుడు రాందేవ్ బాబా అన్నారు. ఇలాంటి ప్రయత్నాలు దేశ ఐక్యతకు, సమగ్రతకు ముప్పు తెస్తున్నాయని ఆయన అన్నారు.