Page Loader
Sambhal Violence: ట్రయల్ కోర్టు అనుమతిపై స్టే.. తదుపరి విచారణను జనవరి 8వ తేదీకి వాయిదా
ట్రయల్ కోర్టు అనుమతిపై స్టే.. తదుపరి విచారణను జనవరి 8వ తేదీకి వాయిదా

Sambhal Violence: ట్రయల్ కోర్టు అనుమతిపై స్టే.. తదుపరి విచారణను జనవరి 8వ తేదీకి వాయిదా

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 29, 2024
01:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్‌లో ఉన్న షామీ జామా మసీదు కమిటీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది సంభాల్ మసీద్ వివాదంపై దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసు హైకోర్టులో విచారణకు వచ్చే వరకు ట్రయల్ కోర్టు పిటిషన్‌ను కొనసాగించకూడదని సీజేఐ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. అదనంగా, అడ్వకేట్ జనరల్ ఇచ్చిన నివేదికను సీల్డ్ కవరులో ఉంచి, దానిని తెరవవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 8కి వాయిదా వేస్తూ, అప్పటి వరకు శాంతి భద్రతలను కాపాడాలని యూపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

వివరాలు 

దాడిని అదుపు చేయడానికి పోలీసులు బాష్పవాయువు

జమియత్ ఉలమా-ఏ-హింద్ అధ్యక్షుడు మౌలానా మహమూద్ అసద్ మదానీ మాట్లాడుతూ, పాత మృతదేహాలను కూల్చివేయడం లాంటి చర్యలు దేశ లౌకిక పునాదులను దెబ్బతీస్తున్నాయని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పును ఆయన స్వాగతించారు. అయితే, సంభాల్‌లోని షామీ జామా మసీదులో సర్వే కోసం వచ్చిన అధికారులపై కొందరు ముస్లిం సంఘాల నేతలు రాళ్లతో దాడి చేసిన ఘటన చర్చనీయాంశమైంది. దాడిని అదుపు చేయడానికి పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. ఈ ఉద్రిక్త ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు పోలీసులు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.