NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Dera baba: డేరా బాబాకు భారీ ఝులక్‌.. 'సుప్రీం' నోటీసులు
    తదుపరి వార్తా కథనం
    Dera baba: డేరా బాబాకు భారీ ఝులక్‌.. 'సుప్రీం' నోటీసులు
    డేరా బాబాకు భారీ ఝులక్‌.. 'సుప్రీం' నోటీసులు

    Dera baba: డేరా బాబాకు భారీ ఝులక్‌.. 'సుప్రీం' నోటీసులు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 03, 2025
    05:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్, ఒక లైంగికదాడి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

    2002లో డేరా బాబా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా బాబా, మరో నలుగురిపై సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది.

    ఈ కేసులో సీబీఐ పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారించింది, జస్టిస్ బేలా ఎం త్రివేది నేతృత్వంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం కేసును విచారించనుంది.

    రంజిత్ సింగ్ హత్యకు సంబంధించి 2002లో పంజాబ్‌ విద్యార్థిని, డేరాబాబా శిష్యురాలు పేరుతో కేంద్ర ప్రభుత్వానికి, హోం మంత్రిత్వ శాఖకు, సీబీఐ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC)కు ఓ ఆకాశ రామన్న లేఖ అందింది.

    వివరాలు 

    డేరా బాబా సహా నలుగురు నిందితులను దోషులుగా సిబిఐ 

    ఆ లేఖలో, డేరా బాబా ఆచరించిన అశ్లీల కార్యకలాపాలు శిష్యులపై అత్యాచారాలు,తిరగబడిన వారిపై హత్యలను వివరించింది.

    దీంతో డేరా బాబా,తన శిష్యుల దృష్టిలో దేవుడిగా ఉన్నప్పటికీ, ప్రజల మధ్య అవమానాలకు గురయ్యాడు.

    రంజిత్ సింగ్ మృతిపై అనుమానాలు మొదలయ్యాయి, ఆ సమయంలోనే అతని హత్య జరిగింది.

    2021లో ఈ కేసును సీబీఐ విచారించింది, ఇందులో డేరా బాబా సహా నలుగురు నిందితులను దోషులుగా తేల్చింది. సీబీఐ వారు ఈ నిందితులకు జీవిత ఖైదు విధించారు.

    ఇక, 2024 మే నెలలో డేరా బాబా తనపై నమోదైన అత్యాచార కేసులు, జర్నలిస్ట్ రామచందర్ ఛత్రపతి హత్య కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలని కోరుతూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాడు.

    వివరాలు 

    రంజిత్ సింగ్ హత్య కేసులో జీవిత ఖైదు

    హైకోర్టు సీబీఐ కోర్టు జారీ చేసిన శిక్షను రద్దు చేసింది, కానీ సీబీఐ మాత్రం సుప్రీం కోర్టుకు చేరుకుంది.

    2017లో డేరా బాబా అత్యాచారాలకు సంబంధించి దోషిగా నిర్ధారితమై 20 సంవత్సరాల జైలు శిక్షను అనుభవించసాగాడు.

    పలు హత్య కేసుల్లో కూడా అతను హర్యానా రాష్ట్రంలోని రోహతక్ జైలులో జీవితం గడుపుతుండగా , రంజిత్ సింగ్ హత్య కేసులో సీబీఐ అతనికి జీవిత ఖైదును విధించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    డేరా బాబా
    సుప్రీంకోర్టు

    తాజా

    Kidambi Srikanth: జపాన్ ఆటగాడిపై గెలిచిన శ్రీకాంత్.. ఫైనల్‌కు చేరుకున్న స్టార్ షట్లర్ బ్యాడ్మింటన్
    Theatres bandh: జూన్ 1 నుంచి థియేటర్లు బంద్.. క్లారిటీ ఇచ్చిన ఫిల్మ్ ఛాంబర్ టాలీవుడ్
    India Test Squad: టీమిండియా టెస్టు సారథిగా శుభ్‌మన్‌ గిల్‌ ఎంపిక శుభమన్ గిల్
    Chandrababu: 2.4 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంతో ఏపీ ముందుకు.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ప్రణాళికలు చంద్రబాబు నాయుడు

    డేరా బాబా

    Dera Baba: డేరా బాబాకు మరోసారి పెరోల్.. రెండు నెలల తరువాత ఇంకోసారి .. జైల్లో కంటే బయటే ఎక్కువ..!  భారతదేశం
    Gurmeet Ram Rahim Acquitted: హత్య కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ ను నిర్దోషిగా ప్రకటించిన పంజాబ్, హర్యానా హైకోర్టు  భారతదేశం

    సుప్రీంకోర్టు

    Tirupati Laddu: తిరుమల లడ్డూ కేసులో ఏపీ ప్రభుత్వం నియమించిన స్వతంత్ర సిట్ సభ్యుల పేర్లు ఇవే! తిరుపతి
    Goddess Of Justice: సుప్రీంకోర్టులో న్యాయదేవత విగ్రహంలో మార్పులు.. కళ్ల గంతలు తొలగింపు.. చేతిలోకి రాజ్యాంగం! డివై చంద్రచూడ్
    Isha Foundation: ఈశా ఫౌండేషన్​కు సుప్రీం కోర్టులో ఊరట భారతదేశం
    Supreme Court: బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని వ్యక్తిగత చట్టాల ద్వారా అడ్డుకోలేము: సుప్రీం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025