
Isha Foundation: ఇషా ఫౌండేషన్‌కు షోకాజ్ నోటీసు రద్దు.. సమర్ధించిన సుప్రీం కోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
అక్రమ నిర్మాణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈశా ఫౌండేషన్ (Isha Foundation)కు సుప్రీంకోర్టు (Supreme Court) నుంచి తాత్కాలిక ఊరట లభించింది.
ఈ వ్యవహారంలో మద్రాసు హైకోర్టు (Madras High Court) ఇచ్చిన ఉత్తర్వులను పునఃసమీక్షించాల్సిన అవసరం లేదని, తాము ఏ విధమైన జోక్యం చేసుకోబోమని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్‌ల నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
అదనంగా, ఈశా ఫౌండేషన్‌పై బలవంతపు చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశించింది.
వివాదం
ఈ వివాదం ఎలా మొదలైంది?
తమిళనాడు రాష్ట్రంలోని వెల్లియంగిరి ప్రాంతంలో ఈశా ఫౌండేషన్ ఉంది. అయితే, పర్యావరణ అనుమతులు పొందకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టినట్టు తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి (TNPCB) ఆరోపించింది.
ఈ క్రమంలో, ఫౌండేషన్‌కు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులపై ఈశా ఫౌండేషన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ టీఎన్‌పీసీబీ(TNPCB)జారీ చేసిన నోటీసులను హైకోర్టు కొట్టివేసింది.
ఫౌండేషన్ నిబంధనలకు లోబడి నిర్మాణాలు చేపట్టిందని స్పష్టం చేసింది.
అయితే,కాలుష్య నియంత్రణ మండలి ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
శుక్రవారం జరిగిన విచారణలో,ఈశా ఫౌండేషన్ యోగా,ధ్యాన కేంద్రం అన్ని పర్యావరణ నిబంధనలను అనుసరించి నిర్మించబడిందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.
అదనంగా,ఫౌండేషన్‌పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని టీఎన్‌పీసీబీకి ఆదేశాలు జారీ చేసింది.