Page Loader
MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల  
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల  

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 24, 2025
03:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తలా ఐదుగురు సభ్యుల పదవీకాలం ముగియనున్న కారణంగా, మొత్తం 10 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 29 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, పి. అశోక్‌బాబు, తిరుమలనాయుడు, దువ్వారపు రామారావు పదవీకాలం ముగియనుంది. తెలంగాణలో పదవీకాలం ముగిసే వారిలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్ హాసన్ ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఎన్నికల సంఘం అధికారికంగా షెడ్యూల్‌ను ప్రకటించింది.

వివరాలు 

ఎన్నికలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు: 

. ఎన్నికల నోటిఫికేషన్ జారీ: మార్చి 3 . నామినేషన్ల స్వీకరణ ప్రారంభం: మార్చి 10 . నామినేషన్ల పరిశీలన: మార్చి 11 . నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: మార్చి 13 . పోలింగ్ తేదీ: మార్చి 20 (ఉదయం 9:00 నుండి సాయంత్రం 4:00 వరకు) . ఓట్ల లెక్కింపు: మార్చి 20 (పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 5:00 నుండి)