LOADING...
Security Breach At Parliament: పార్లమెంటు గోడ దూకి పార్లమెంట్ భవనంలోకి వెళ్లిన చొరబాటుదారుడు
పార్లమెంటు గోడ దూకి పార్లమెంట్ భవనంలోకి వెళ్లిన చొరబాటుదారుడు

Security Breach At Parliament: పార్లమెంటు గోడ దూకి పార్లమెంట్ భవనంలోకి వెళ్లిన చొరబాటుదారుడు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 22, 2025
11:12 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో పార్లమెంట్‌ భవనం వద్ద శుక్రవారం ఉదయం భద్రతా ఉల్లంఘన ఘటన చోటుచేసుకుంది. అత్యంత కఠినమైన భద్రతా ఏర్పాట్లున్న ప్రాంగణంలో ఒక చొరబాటుదారుడు చెట్టు ఎక్కి, గోడ దూకి కొత్త పార్లమెంట్ భవనం గరుడ్ గేట్‌ వద్దకు ప్రవేశించాడు. ఈ ఘటన ఉదయం 6:30 గంటల సమయానికి జరిగింది. భద్రతా సిబ్బంది అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు.ఈ సంఘటన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన మరుసటి రోజు చోటుచేసుకుంది. ఈ సమావేశాలు జులై 21న ప్రారంభమయ్యాయి.

వివరాలు 

పార్లమెంట్‌  పై ఉగ్రదాడి జరిగి 22 ఏళ్లు 

గతంలో కూడా పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘనల చరిత్ర ఉంది. 2023లో పార్లమెంట్ శీతాకాల సమావేశాల సమయంలో లోక్‌సభలోకి ఇద్దరు దుండగులు దూసుకెళ్లిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అలాగే, పార్లమెంట్‌ పై ఉగ్రదాడి జరిగి 22 ఏళ్లు అయిన డిసెంబరు 13న ఆ ఘటన చోటుచేసుకోవడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఆ సందర్భంలో లోక్‌సభలోని పబ్లిక్ గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు యువకులు సభలోకి దూకి గందరగోళం సృష్టించారు. రంగుల పొగను విడుదల చేసి అందరిని భయభ్రాంతులకు గురిచేశారు. అదే సమయంలో పార్లమెంట్‌ వెలుపల కూడా ఇద్దరు వ్యక్తులు ఇదేరకమైన నిరసనను చేపట్టారు. ఈ ఘటనల తర్వాత పార్లమెంట్ భద్రతా ఏర్పాట్లను మరింతగా కఠినతరం చేశారు.

వివరాలు 

 గతేడాది ఆగస్టులో కూడా ఈతరహా ఉల్లంఘన ఘటన 

గతేడాది ఆగస్టులో కూడా ఇలాంటి ఉల్లంఘన చోటు చేసుకుంది. ఓ యువకుడు పార్లమెంట్ గోడ దూకి లోపలికి చొరబడటానికి ప్రయత్నించాడు. పోలీసులు అతడిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన మనీశ్‌గా గుర్తించారు. ఆ సమయంలో అతడి వద్ద ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని అప్పట్లో పోలీసులు వెల్లడించారు.