
Prabhat Jha: బీజేపీ నేత ప్రభాత్ ఝా కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
బీజేపీ నేత ప్రభాత్ ఝా కన్నుమూశారు. 67 సంవత్సరాల వయస్సులో, అయన గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.
ఝా కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. దాదాపు నాలుగు వారాల పాటు గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందారు.
ఈరోజు ఉదయం ఐదు గంటల ప్రాంతంలో మృతి చెందారు. ఝా మృతితో విషాద ఛాయలు అలముకున్నాయి.
ప్రభాత్ ఝా మృతి పట్ల మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, డిప్యూటీ సీఎం రాజేంద్ర శుక్లాతో పాటు పలువురు బీజేపీ, కాంగ్రెస్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
VD Sharma చేసిన ట్వీట్
भाजपा वरिष्ठ नेता, @BJP4MP के पूर्व प्रदेश अध्यक्ष आदरणीय श्री प्रभात झा जी के निधन का अत्यंत दुखद समाचार प्राप्त हुआ। ईश्वर दिवंगत आत्मा को अपने श्री चरणों में स्थान दें एवं शोकाकुल परिजनों को इस भीषण वज्रपात को सहने की शक्ति दें।
— VD Sharma (@vdsharmabjp) July 26, 2024
ॐ शांति! pic.twitter.com/d5BSkjNar9
వివరాలు
ప్రభాత్ ఝా బీహార్‌లోని దర్భంగా నివాసి
ప్రభాత్ ఝా ఆరోగ్యం క్షీణించినప్పుడు, అయన భోపాల్‌లో ఉన్నారు. గత నెలలో ఆయన భోపాల్‌లోని బన్సాల్ ఆసుపత్రిలో చేరారు.
ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సమాచారం అందిన వెంటనే సీఎం మోహన్ యాదవ్ ఝాను పరామర్శించేందుకు ఆస్పత్రికి చేరుకున్నారు.
అయన ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించినప్పుడు,ఆయనని భోపాల్ నుండి ఢిల్లీకి విమానంలో తరలించారు. ప్రభాత్ ఝా అసలు బీహార్ కి చెందినవారు.
అయన బిహార్‌లోని దర్భంగాలోని హరిహర్‌పూర్ గ్రామంలో 4 జూన్ 1957న జన్మించారు.అయితే తర్వాత కుటుంబంతో సహా గ్వాలియర్‌కు వచ్చారు.
ఝా మధ్యప్రదేశ్ రాజకీయాల్లో నిరంతరం చురుకుగా ఉన్నారు. ఆయన మధ్యప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.
ప్రభాత్ ఝా మధ్యప్రదేశ్ బిజెపికి చెందిన శక్తివంతమైన నాయకులలో ఒకరు.ఝా రెండుసార్లు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు.