Sheikh Hasina: కొంతకాలం ఇండియాలోనే షేక్ హసీనా.. దిల్లీలో భారీ బందోబస్తు
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం రక్తపాతానికి తెర లేపింది. సోమవారం అది తీవ్రరూపం దాల్చడంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి, భారత్ కు వచ్చారు. ప్రస్తుతం ఆమె దిల్లీలో ఉన్నారు. అయితే లండన్‌లో ఆశ్రమం పొందేందుకు అమె చేస్తున్నట్లు ప్రయత్నాలు ఫలించడం లేదు. మరోవైపు బ్రిటన్ కూడా నిరాకరించింది. దీంతో ఆమె కొన్నాళ్లు పాటు ఇండియాలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. 'సేఫ్ హౌస్' నుండి భద్రతా ఏర్పాట్ల వరకు ఆమెకు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధమవుతోంది.
కొంత సమయం ఇస్తామన్న విదేశాంగమంత్రి
ఆ క్షణంలో రావడానికి షేక్ హసీనా అనుమతిని ఇచ్చామని, భవిష్యత్ ప్రణాళిక గురించి ఆమెతో మాట్లాడే ముందు ఆమె కోలువడానికి కొంత సమయం ఇస్తామని విదేశాంగమంత్రి ఎన్ జైశంకర్ పేర్కొన్నారు. భారతదేశంలో ఆశ్రయం పొందే విధానం లేనప్పటికీ, హసీనా తన మిత్రదేశంగా ఉన్న దేశంలో "సురక్షితంగా" ఉంటుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. తాజా పరిణామాల గురించి ప్రధాని నరేంద్ర మోదీకి ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తున్నారు.
బంగ్లా సరిహద్దులో భద్రత పెంపు
హసీనాను భారత ఇంటెలిజెన్స్ నిర్వహించే మరో "సేఫ్ హౌస్"కి తరలించాలా లేదా రాజధానిలోని మరొక ప్రదేశానికి అధిక భద్రతతో తరలిస్తారా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఆమె భారత్‌కు పారిపోవడంతో బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భద్రతను పెంచారు. షేక్ హసీనా ప్రస్తుతానికి ఇండియాలోనే ఉంది. అయితే ఆమె ఇక్కడే ఉంటే కొన్ని హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉంటుంది.