NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Demolitions: ఇళ్ల కూల్చివేతల చర్యలతో అంతా కలవరపడ్డారు: యూపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం 
    తదుపరి వార్తా కథనం
    Demolitions: ఇళ్ల కూల్చివేతల చర్యలతో అంతా కలవరపడ్డారు: యూపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం 
    యూపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

    Demolitions: ఇళ్ల కూల్చివేతల చర్యలతో అంతా కలవరపడ్డారు: యూపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 01, 2025
    03:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వంపై ఇళ్ల కూల్చివేతల సంబంధించి సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

    ఆ తీరు దిగ్భ్రాంతికరమని వ్యాఖ్యానించింది. "బాధితులకు కనీసం ఆశ్రయం పొందే హక్కు కూడా లేదా ?" అంటూ ప్రశ్నించింది .

    "ఇలాంటి కూల్చివేతలు పూర్తిగా అమానవీయమైనవి, చట్టవిరుద్ధమైనవి. దేశంలో రూల్‌ ఆఫ్‌ లా (Law) అమలులో ఉన్నది. ఈ తరహా కూల్చివేతలు ఒక ఫ్యాషన్‌గా మారకూడదు. బాధితులకు ఆరువారాలలో రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలి," అని సుప్రీంకోర్టు ప్రయాగ్‌రాజ్‌ అభివృద్ధి సంస్థకు ఆదేశించింది.

    వివరాలు 

    ఈ చర్యలు తప్పుడు సంకేతాలను ప్రసారం చేస్తున్నాయి

    ప్రయాగ్‌రాజ్‌లో చట్ట ప్రక్రియను పాటించకుండా, గడిచిన కొన్ని రోజులలో కూల్చివేతలు చేపట్టినందుకు సుప్రీంకోర్టు గతంలోనూ తీవ్రంగా స్పందించింది.

    "ఈ చర్యలు తప్పుడు సంకేతాలను ప్రసారం చేస్తున్నాయి," అని సుప్రీం అసహనం వ్యక్తం చేసింది.

    2023లో పోలీస్‌ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్‌కు చెందిన భూమిగా భావించి,, అక్కడి నివాసాలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుగా కూల్చివేసిందని బాధితులు తమ పిటిషన్లో పేర్కొన్నారు.

    వారిలో ఒక న్యాయవాది, ఒక ప్రొఫెసర్‌తో పాటు మరికొందరు బాధితులు ఉన్నారు.

    అయితే, హైకోర్టులో వేసిన పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. ఆ తర్వాత, వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    సుప్రీంకోర్టు

    Supreme court: కుల వివక్ష నిర్మూలనపై యూజీసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇండియా
    Dallewal: దల్లేవాల్ ఆరోగ్యంపై నేడు సుప్రీంకోర్టులో ధిక్కరణ పిటిషన్ భారతదేశం
    Mohan Babu : హైకోర్టు నిరాకరణ.. బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబు  మంచు విష్ణు
    Mohan Babu : సుప్రీం కోర్టులో మోహన్ బాబా బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా మంచు విష్ణు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025