LOADING...
Droupadi Murmu: 'మీకు కన్నడ తెలుసా?'.. కర్ణాటక సీఎం ప్రశ్నకు రాష్ట్రపతి ఆసక్తికర సమాధానం!
'మీకు కన్నడ తెలుసా?'.. కర్ణాటక సీఎం ప్రశ్నకు రాష్ట్రపతి ఆసక్తికర సమాధానం!

Droupadi Murmu: 'మీకు కన్నడ తెలుసా?'.. కర్ణాటక సీఎం ప్రశ్నకు రాష్ట్రపతి ఆసక్తికర సమాధానం!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 02, 2025
12:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కన్నడ భాష నేర్చుకోవడానికి ప్రయత్నించాలనుకుంటున్నట్టు వెల్లడించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక ప్రశ్న అడగగా, ఆమె చిరునవ్వుతో స్పందించారు. మైసూరులోని అఖిల భారత వాక్ శ్రవణ సంస్థ (ఏఐఐఎస్‌హెచ్) వజ్రోత్సవ వేడుకల్లో సోమవారం ఈ ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి సమక్షంలో, సీఎం సిద్ధరామయ్య తన ప్రసంగాన్ని కన్నడలో ప్రారంభించారు. ఆ తర్వాత వేదికపై ఉన్న రాష్ట్రపతిని చూసి నవ్వుతూ, "మీకు కన్నడ అర్థమవుతుందా?" అని అడిగారు. దీనికి రాష్ట్రపతి తన ప్రసంగంలో బదులిచ్చారు.

వివరాలు 

ప్రతి ఒక్కరూ తమ భాషను, సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపు 

"గౌరవ ముఖ్యమంత్రికి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కన్నడ నా మాతృభాష కాదుగానీ,భారతదేశంలోని అన్ని భాషలు,సంస్కృతులు,సంప్రదాయాలను నాకు ఎంతో ఇష్టం. వాటిని గౌరవంతో నేను ఆచరిస్తాను,"అని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. అలాగే,ప్రతి వ్యక్తి తన భాష,సంస్కృతి పరిరక్షించుకోవాలని ఆమె ఆకాంక్షించారు."నేను తప్పక కొద్దిగా అయినా కన్నడ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను"అని ఆమె చెప్పిన వెంటనే సభలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కర్ణాటకలో నివసించే ప్రతి వ్యక్తి కన్నడ నేర్చుకోవాలని సీఎం సిద్ధరామయ్య గతంలో అనేకసార్లు సూచించారు. రాష్ట్రపతి పర్యటనలో భాగంగా,ఆమె మైసూరు విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్,సీఎం సిద్ధరామయ్య స్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో కేంద్రమంత్రి అనుప్రియా పటేల్,కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు, బీజేపీ ఎంపీ యదువీర్ వాడియార్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కన్నడ భాషను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తానన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము