
Sidhu Moosewala: సిద్ధూ మూసేవాలా చిన్నారి తమ్ముడి ఫొటో వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రసిద్ధ గాయకుడు,కాంగ్రెస్ నాయకుడు సిద్ధూ మూసేవాలా (Sidhu Moosewala) తల్లిదండ్రులు ఇటీవల ఐవీఎఫ్ ద్వారా మరో బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా, ఆ చిన్నారి ఫొటోను వారు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
సిద్ధూ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఇప్పటికీ అతని తల్లిదండ్రులు వినియోగిస్తూ ఉండగా, తమ చిన్న కుమారుడి ఫోటోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
మూసేవాలా తల్లి చరణ్ కౌర్ 58 ఏళ్ల వయసులో, ఈ ఏడాది మార్చి 17న ఐవీఎఫ్ సాయంతో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.
ఆ చిన్నారికి శుభ్‌దీప్ సింగ్ అని పేరు పెట్టారు. ఇది సిద్ధూ మూసేవాలా అసలు పేరు కూడా.
అయితే ఈ వార్త అప్పట్లో చర్చనీయాంశమైంది.
వివరాలు
సిద్ధూ తండ్రి బాల్‌కౌర్ సింగ్ ఆవేదన
ఐవీఎఫ్ ట్రీట్‌మెంట్‌కు వయో పరిమితి ఉన్నందున, దీనిపై నివేదిక సమర్పించాలంటూ పంజాబ్ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది.
ఈ నిర్ణయంపై సిద్ధూ తండ్రి బాల్‌కౌర్ సింగ్ ఆవేదన వ్యక్తంచేశారు, తనకు పుట్టిన రెండో బిడ్డ విషయంలో పంజాబ్ ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు.
ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా 2022 మే 29న హత్యకు గురైన సంగతి తెలిసిందే.
తన స్వగ్రామం మాన్సాకు వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో దుండగులు కాల్పులు జరిపి అతన్ని హత్య చేశారు.
ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సిద్ధూ తల్లిదండ్రులకు ఆయన ఒక్కగానొక్క సంతానం.
అందుకే వృద్ధాప్యంలో తోడు కోసం మరో బిడ్డను కనాలని నిర్ణయం తీసుకుని, ఐవీఎఫ్ పద్ధతిలో మరొక కుమారుడిని పొందారు.