LOADING...
వరదలో మునిగిన సుప్రీంకోర్టు, రాజ్‌ఘాట్.. ప్రధాన రహదారుల్లో భారీ టాఫ్రిక్ జామ్
వరద నీటిలో మునిగిన రాజ్‌ఘాట్

వరదలో మునిగిన సుప్రీంకోర్టు, రాజ్‌ఘాట్.. ప్రధాన రహదారుల్లో భారీ టాఫ్రిక్ జామ్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 14, 2023
12:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీ పరిసర ప్రాంతాల్లో కుంభవృష్టి కారణంగా మహానగరంలోని వీధులన్నీ యమునా నది ఉగ్రరూపాన్ని చవిచూసినట్టైంది. దిల్లీ పరిసరాల్లోని కాలనీలే కాదు ఏకంగా సుప్రీంకోర్టు సహా మహాత్మా గాంధీ సమాధి రాజ్ ఘాట్ ను వరద నీరు చుట్టుముట్టింది. సీఎం నివాసం, మంత్రుల క్వార్టర్లు, సచివాలయం ఇప్పటికే వరద గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. ఈ మేరకు ప్రధాన రహదారులపై మోకాలు లోతుతో నీరు నిలిచిపోయింది. కాలనీల్లో భారీ వరదతో ప్రజలు నానా యాతన పడుతున్నారు. గంట గంటకూ క్రమేపీ ప్రవాహం తగ్గడం రాజధాని వాసులకు ఊరటనిచ్చే అంశం. సిటీలోని పలు ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్ కోతలు పడే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.ఉదయం సారాయి కాలే ఖాన్ టీజంక్షన్ వద్ద ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సుప్రీంకోర్టు కాంప్లెక్స్ ను చుట్టుముట్టిన వరద నీరు

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మహాత్మా గాంధీ  రాజ్‌ఘాట్ ను ముంచెత్తిన వరద నీరు