Page Loader
Supreme Court : ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీం ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు 
Supreme Court : ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీం ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు

Supreme Court : ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీం ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 02, 2023
01:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలోని రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్‌ స్కీమ్‌ చెల్లుబాటు పిటిషన్ పై సుప్రీం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌ను 2018 జనవరి 2న కేంద్రం నోటిఫై చేసింది. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ప్రభుత్వం, దాతల మధ్య క్విడ్ ప్రోకోకు అవకాశం కల్పిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే కేంద్రం అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలని భావిస్తే విరాళాలన్నీ ఎన్నికల సంఘానికి ఇవ్వాలని ధర్మాసనం సూచించింది.ఈ మేరకు ఆయా విరాళాలను ఈసీ పార్టీలకు సమానంగా పంచుతుందని పేర్కొంది.

details

విరాళాల వివరాలు ప్రజలకు అందుబాటులో లేవు : సుప్రీం

ఇదే సమయంలో ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ వివరాలు అందరికీ అందుబాటులో లేకపోవడంపై సుప్రీం ప్రశ్నించింది. బాండ్ల ద్వారా దాతలు అందించే విరాళాల వివరాలు ప్రజలకు అందుబాటులో లేవని అసంతృప్తి వ్యక్తం చేసింది. వీటిని జారీ చేసే అధీకృత బ్యాంక్ భారతీయ స్టేట్ బ్యాంక్, దర్యాప్తు సంస్థలు మాత్రమే విరాళాల వివరాలు పొందే వీలుందని కోర్టు వెల్లడించింది. రాజకీయ పార్టీలకు డబ్బులు అందించడం ద్వారా ఇది ముడుపులకు చట్ట బద్ధత కల్పిస్తుందని స్పష్టం చేసింది. ఒకవేళ ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలని భావిస్తే విరాళాలన్నీ ఎన్నికల సంఘానికి ఇవ్వాలని సూచించింది. వాటిని ఈసీ రాజకీయ పార్టీలకు సమానంగా పంచుతుందని తెలిపింది.