Ranveer Allahbadia: ఇలాంటి భాష ఎవరికైనా నచ్చుతుందా..?: రణ్‌వీర్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియాస్ గాట్ లాటెంట్ (IGL) కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) పై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
"పాపులారిటీ ఉందని ఎవరైనా ఏదైనా మాట్లాడుతారా? ఇలాంటి భాషను ఎవరికైనా ఆమోదయోగ్యంగా ఉంటుందా?" అంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
సుప్రీంకోర్టు స్పందన
"ఇది అసభ్యత కాదని చెప్పాలంటే మరేం చెప్పాలి? మీ మెదడులోని చెత్త అంతా ఆ ప్రోగ్రామ్ ద్వారా బయటపెట్టారు. ఇలాంటి ప్రవర్తన ఖండించదగినది. పాపులారిటీ ఉందని ఏదైనా మాట్లాడతారా? సమాజం ఇలాంటి వ్యాఖ్యలను ఎలా సహించగలదు? ఇలాంటి వ్యక్తులకు కోర్టు ఎందుకు రక్షణ కల్పించాలి?" అని కోర్టు ప్రశ్నించింది.
వివరాలు
వివాదానికి కారణమైన ఘటన
రణ్‌వీర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు, అనంతరం కొంత ఊరట కల్పించింది.
ఈ వ్యవహారంలో ఇకపై కొత్త కేసులు నమోదు చేయకూడదని ఆదేశాలు ఇచ్చింది.
అలాగే కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని రణ్‌వీర్‌ను హెచ్చరించింది.
తన పాస్‌పోర్టును మహారాష్ట్రలోని ఠాణే పోలీసులకు అప్పగించాలని ఆదేశించింది.
తదుపరి ఉత్తర్వుల వరకు ఎలాంటి షోలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది.
ఇండియాస్ గాట్ లాటెంట్ (IGL) షోలో పాల్గొన్న ఓ వ్యక్తిని రణ్‌వీర్ తల్లిదండ్రులు, శృంగారం గురించి ప్రశ్నించడం తీవ్ర వివాదాస్పదమైంది.
అతడి వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. పలువురు పార్లమెంటు సభ్యులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
రణ్‌వీర్ ఈ వ్యాఖ్యలను సమయ్ రైనా షోలో చేశారు.
వివరాలు
రణ్‌వీర్ తరఫున వాదనలు
దీంతో పలు రాష్ట్రాల్లో రణ్‌వీర్‌పై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ కేసులను ఒకే చోట కలిపి విచారణ జరిపించాలని కోరుతూ యూట్యూబర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై కోర్టు తాజాగా విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు సీజేఐ బాధ్యతల నుంచి ఇటీవల రిటైరైన జస్టిస్ డివై చంద్రచూడ్ కుమారుడు అభినవ్ చంద్రచూడ్, రణ్‌వీర్ తరఫున వాదనలు వినిపించారు.
"నా క్లయింట్ వ్యాఖ్యలు నైతికంగా సమర్థించదగినవి కావు. అయితే, అతడిని హత్య చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి" అని కోర్టుకు తెలియజేశారు.
ఆ సమయంలో మహారాష్ట్ర, అస్సాం పోలీసులను ఆశ్రయించాలని సూచించింది.
కోర్టు దీనిపై స్పందిస్తూ, "అశ్లీల కంటెంట్ నియంత్రణ కోసం కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటోంది?" అని ప్రశ్నించింది.