Page Loader
డీఈఆర్‌సీ చైర్‌పర్సన్‌ ప్రమాణ స్వీకారం వాయిదా వేసిన సుప్రీంకోర్టు; కేంద్రం, ఎల్‌జీకి నోటీసులు 
డీఈఆర్‌సీ చైర్‌పర్సన్‌ ప్రమాణ స్వీకారం వాయిదా వేసిన సుప్రీంకోర్టు; కేంద్రం, ఎల్‌జీకి నోటీసులు

డీఈఆర్‌సీ చైర్‌పర్సన్‌ ప్రమాణ స్వీకారం వాయిదా వేసిన సుప్రీంకోర్టు; కేంద్రం, ఎల్‌జీకి నోటీసులు 

వ్రాసిన వారు Stalin
Jul 04, 2023
12:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (డీఈఆర్‌సీ) చైర్‌పర్సన్‌గా జస్టిస్ (రిటైర్డ్) ఉమేష్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని జూలై 11 వరకు వాయిదా వేయాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. డీఈఆర్‌సీ చైర్‌పర్సన్‌తో ప్రమాణ స్వీకారం చేయించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అడగకూడదని ధర్మాసనం పేర్కొంది. జస్టిస్ ఉమేష్ కుమార్‌ను జూన్ 21న డీఈఆర్‌సీ ఛైర్మన్‌గా కేంద్రం నియమించింది. ఈ నియామకాన్ని దిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ పిటిషన్‌పై కూడా కేంద్రం, లెఫ్టినెంట్ గవర్నర్‌కు మంగళవారం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. జూన్ 11వ తేదీకి ముందురోజు కేంద్రం, ఎల్జీ తమ సమాధానం దాఖలు చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది.

దిల్లీ

మంత్రి అనారోగ్యానికి గురైతే ప్రమాణ స్వీకారం ఆపుతారా: లెఫ్టినెంట్ గవర్నర్ 

దిల్లీ ప్రభుత్వం -లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య నిత్య ఏదో ఒక విషయంలో వివాదం నడుస్తుందనేది అందరికి తెలిసిన విషయమే. బ్యూరోక్రాట్ల నియంత్రణపై కేంద్రం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన తర్వాత దిల్లీ సర్కారు- లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య ఉప్పు నిప్పులాగ మారింది. వాస్తవానికి ఉమేష్ కుమార్ ప్రమాణ స్వీకారం ఇప్పటికే పూర్తికావాల్సింది. అయితే దిల్లీ విద్యుత్ శాఖ మంత్రి అతిషి అనారోగ్యం కారణంగా ప్రమాణ స్వీకారం జులై 6కు వాయిదా పడింది. దీనిపై లెఫ్టినెంట్ గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రికి అనారోగ్యం అయితే ప్రమాణ స్వీకారం ఆపుతారా? సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు. వెంటనే ప్రమాణ స్వీకారం చేయించాలని కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. ఈ క్రమంలో కేజ్రీవాల్‌ను ఎల్జీ అలా అడగొద్దని సుప్రీంకోర్టు తెలిపింది.