LOADING...
Sanjay: ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌ సంజయ్‌ ముందస్తు బెయిల్‌ రద్దు 
ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌ సంజయ్‌ ముందస్తు బెయిల్‌ రద్దు

Sanjay: ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌ సంజయ్‌ ముందస్తు బెయిల్‌ రద్దు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 31, 2025
01:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ సీఐడీ మాజీ డైరెక్టర్ సంజయ్‌కు సంబంధించి కీలక తీర్పు సుప్రీంకోర్టు లో వెలువరించింది. ఆయనకు ముందస్తుగా ఇచ్చిన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంజయ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సంజయ్‌పై అగ్నిమాపక శాఖలో జరిగిన అవినీతి వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఆయన ముందస్తు అరెస్ట్‌ను నివారించేందుకు హైకోర్టులో బెయిల్ కోరగా, హైకోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది.

వివరాలు 

హైకోర్టు తీర్పుపై ధర్మాసనం ఆగ్రహం

అయితే ఆ నిర్ణయాన్ని ప్రభుత్వపక్షం సుప్రీంకోర్టులో ప్రశ్నించింది. ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిగిన తర్వాత, జస్టిస్ అమానుల్లా, జస్టిస్ ఎస్‌.వి.ఎన్. భట్టి లతో కూడిన ధర్మాసనం ఈరోజు తుదితీర్పు ఇచ్చింది. విచారణ సందర్భంగా హైకోర్టు తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్ దశలోనే ట్రయల్ ముగిసినట్టుగా హైకోర్టు తీర్పులో కనిపించిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.