
Mithun Reddy: ఏపీ మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
ఈ వార్తాకథనం ఏంటి
మద్యం కుంభకోణం కేసులో (ఏ4) నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డికి సుప్రీంకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. మద్యం కేసులో ముందుగా అరెస్టు చేయకుండా ఛార్జిషీట్ ఎలా దాఖలు చేశారని ధర్మాసనంలోని జస్టిస్ పార్థివాలా, జస్టిస్ మహదేవన్‌లు సిట్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. ముందస్తు బెయిల్ ఇచ్చేలా ఏవైనా న్యాయసంబంధమైన కారణాలున్నాయా అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని కూడా ప్రశ్నించారు. చివరకు మిథున్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారణ అనంతరం కోర్టు డిస్మిస్ చేసింది.
వివరాలు
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మిథున్ సుప్రీంకోర్టులో పిటిషన్
ఆయన లొంగిపోేందుకు గడువు ఇవ్వాలని చేసిన అభ్యర్థనను కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇంతకుముందు మద్యం కేసులో మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ కూడా ఆయనకు నిరాశే ఎదురైంది. ఆ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మద్యం కుంభకోణం కేసులో మిథున్‌రెడ్డిపై ఇప్పటికే సిట్ అధికారులు లుకౌట్ సర్క్యులర్(ఎల్వోసీ) జారీ చేశారు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో తిరస్కరించబడిన నేపథ్యంలో విదేశాలకు పారిపోయే అవకాశం ఉండటంతో ఆ చర్య తీసుకున్నారు. ముందస్తు బెయిల్ పొందే అవకాశం లేదని ముందుగానే అంచనా వేసిన మిథున్‌రెడ్డి అప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఉన్నచోటును గుర్తించేందుకు ప్రత్యేక సిట్ బృందాలు ఏర్పాటు చేశారు.
వివరాలు
అరెస్టు భయంతో మిథున్‌రెడ్డి అజ్ఞాతంలోకి..
మద్యం కుంభకోణం కేసు బయటపడిన తర్వాత మిథున్‌రెడ్డి రెండోసారి అజ్ఞాతంలోకి వెళ్లడం ఇదే. తన ప్రమేయం దర్యాప్తులో బయటపడిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే మార్చి నెలలో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే అప్పటికి ఆయనపై నేరంగా కేసు నమోదు చేయకపోవడంతో హైకోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. అరెస్టు భయంతో మిథున్‌రెడ్డి అప్పుడు కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయి, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పట్లో విచారణ కొనసాగుతున్నంతకాలం అరెస్టు చేయరాదని మధ్యంతర రక్షణగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆయన బయటకు వచ్చారు. అయితే ఇప్పుడు మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం మిథున్‌రెడ్డి ఉండే స్థలం గుర్తించిన వెంటనే సిట్ అధికారులు ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉంది.