LOADING...
Telangana: తెలంగాణ గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
తెలంగాణ గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Telangana: తెలంగాణ గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2025
05:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, గవర్నర్ కోటా కింద కోదండరామ్,అమీర్ అలీ ఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమించారు. ఈ నియామకాలపై దాఖలైన కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాలకు సంబంధించి 2024 ఆగస్టు 14న సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ఇంతకుముందు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఊరట లభించింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా ప్రస్తుత పరిస్థితిని కొనసాగించాలని (స్టేటస్ కో) పిటిషనర్ తరఫున న్యాయవాది కపిల్ సిబల్ వాదించగా,గవర్నర్ నామినేషన్లను అడ్డుకునే అధికారం తమకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

వివరాలు 

కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని నిలిపివేయాలని పిటీషన్‌

ఎమ్మెల్సీల నియామకం ప్రభుత్వం తరఫున నిరంతరం జరిగే ప్రక్రియ అని, ఇది ప్రభుత్వ బాధ్యతలో భాగమని కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును మరోసారి గుర్తు చేసింది. గత ప్రభుత్వం చేసిన నియామకాల స్థానంలో, కొత్త ప్రభుత్వం తమ అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడంపై బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రావణ్, కుర్ర సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని నిలిపివేయాలని పిటీషన్‌లో డిమాండ్ చేశారు. అలాగే, కొత్త నియామకాలపై స్టే విధించాలని కోరినా, ధర్మాసనం ఆ అభ్యర్థనను తిరస్కరించింది. ప్రభుత్వం, గవర్నర్ ఏ నిర్ణయాలు తీసుకున్నా అవి సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది.