Page Loader
KUNO NATIONAL PARK : చీతాల మరణాలపై సుప్రీంకోర్టు ఆరా.. కేంద్రంపై ప్రశ్నల వర్షం
చీతాల మరణాలపై సుప్రీంకోర్టు ఆరా.. కేంద్రంపై ప్రశ్నల వర్షం

KUNO NATIONAL PARK : చీతాల మరణాలపై సుప్రీంకోర్టు ఆరా.. కేంద్రంపై ప్రశ్నల వర్షం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 20, 2023
05:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

కునో నేషనల్ పార్కులో ఇటీవలే చిరుతపులుల వరుస మరణాలు ఎక్కువగా సంభవించడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్‌లోని జాతీయ చీతాల పార్కులో ఘటనలపై స్పందించిన సుప్రీం, ఇలాంటి సంకేతాలు అంత మంచిది కాదని అభిప్రాయపడింది. వరుస మరణాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఈ మేరకు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ప్రాజెక్ట్‌ చీతాలో భాగంగా విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాలు క్రమంగా కనుమరగవడంపై సర్వోన్నత న్యాయస్థానం విచారణకు ఉపక్రమించింది. ఆఫ్రికా ఖండంలోని నమీబియా,దక్షిణాఫ్రికాల నుంచి 20 చీతాలను భారత్ తరలించారు. మధ్యప్రదేశ్‌లోని కునో పార్క్‌లో స్వయంగా ప్రధాని మోదీ వీటిని వదిలారు.అయితే ఈ 20లో ఇప్పటికే 8 చీతాలు ప్రాణాలు కోల్పోవడంతో 40 శాతం మేర చీతాలు అంతరించిపోయాయి.

DETAILS

ఆగస్టు 1కి తదుపరి విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు

మరో రెండు చీతాల ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పులుల సంరక్షణపై కేంద్ర ప్రభుత్వ తీరును సుప్రీం ప్రశ్నించింది. పులుల సంరక్షణ సంస్థకు మార్గదర్శం చేయాలంటూ కేంద్రం గతంలో ఓ నిపుణుల కమిటీని నియమించింది. కాగా సదరు కమిటీ పులులు అంతరించిపోతున్నాయని దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం గురువారం విచారించింది.వాతావరణం కారణంగా పలు చీతాలు మరణిస్తాయని కేంద్రం ముందుగానే ఊహించిందని కేంద్రం తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వరుసగా చనిపోతున్నా వాటిని పార్కులోనే ఉంచడంపై సుప్రీం అభ్యంతరం తెలిపింది. ఎందుకు వేరే చోటకి తరలించే ప్రయత్నాలు చేయట్లేదని అడిగింది. దీనిపై పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తూ ఆగస్టు 1కి తదుపరి విచారణ వాయిదా వేసింది.