Supreme Court:హైకోర్టు సిట్టింగ్ జడ్జిపై వచ్చిన ఫిర్యాదులు.. లోక్‌పాల్ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే
ఈ వార్తాకథనం ఏంటి
సుప్రీంకోర్టు (Supreme Court) లోక్‌పాల్ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది.
హైకోర్టు జడ్జిలను విచారించే అధికారం తమకు ఉందంటూ లోక్‌పాల్ ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
ఆ ఉత్తర్వులు ఆందోళన కలిగించేలా ఉన్నాయంటూ అత్యున్నత న్యాయస్థానం ఈ సందర్భంలో వ్యాఖ్యానించింది.
ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, లోక్‌పాల్ రిజిస్ట్రార్‌లకు నోటీసులు జారీ చేసింది.
వివరాలు
రెండు ఫిర్యాదులను పరిశీలిస్తున్నలోక్‌పాల్
హైకోర్టు సిట్టింగ్ అదనపు జడ్జిపై వచ్చిన రెండు ఫిర్యాదులను లోక్‌పాల్ పరిశీలిస్తోంది.
2013 లోకాయుక్త చట్టం ప్రకారం హైకోర్టు జడ్జిలను విచారించే హక్కు తమకుందని పేర్కొంటూ జనవరి 27న లోక్‌పాల్ ఉత్తర్వులు జారీ చేసింది.
దీనిని గమనించిన సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని స్వయంగా (సుమోటోగా) విచారణకు తీసుకుని స్టే విధించింది.
అదేవిధంగా, సంబంధిత హైకోర్టు న్యాయమూర్తి పేరును బయట వెల్లడించొద్దని ఫిర్యాదుదారుడిని ఆదేశించింది.