
Places of Worship Act: ప్రార్థనా స్థలాల చట్టంపై విచామధ్యంతర పిటీషన్లపై సుప్రీంకోర్టు అసహనం
ఈ వార్తాకథనం ఏంటి
1991 ప్రార్థనా స్థలాల చట్టంపై ఇంకా పిటీషన్లు దాఖలవుతున్నాయి. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ కేసులు దాఖలవుతున్న నేపథ్యంలో, సుప్రీంకోర్టు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
మధ్యంతర అప్లికేషన్లు దాఖలు చేయడంపై ఒక పరిమితి ఉండాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ప్రార్థనా స్థలాల చట్టం అమలుపై వాదనలు చేపట్టింది.
అయితే,మధ్యంతర పిటీషన్లు అధికంగా ఉండటంతో,ఈ రోజు ఈ కేసును విచారణకు స్వీకరించలేమని న్యాయస్థానం ప్రకటించింది.
త్రిసభ్య ధర్మాసనం ముందే చాలా ఎక్కువ పిటీషన్లు పెండింగ్‌లో ఉన్నాయని,ఈ కేసును ఏప్రిల్ మొదటి వారంలో విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
వివరాలు
అనేక పిటీషన్లకు అనుమతి
మధ్యంతర పిటీషన్లు దాఖలు చేయడానికి ఒక పరిమితి ఉండాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా అభిప్రాయపడ్డారు.
ఈ ప్రార్థనా స్థలాల చట్టంపై అనేక రాజకీయ పార్టీలు మధ్యంతర పిటీషన్లు దాఖలు చేశాయి.
వాటిలో కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, జమాత్ ఉల్మా హింద్, ఎంఐఎం వంటి పార్టీలు ఉన్నాయి.
ఈ రాజకీయ పార్టీలు 1991 ప్రార్థనా స్థలాల చట్టాన్ని సమర్థించాయి. అయితే, ఈ చట్టాన్ని సవాల్ చేసే పిటీషన్లను ఈ పార్టీలు వ్యతిరేకించాయి.
గత విచారణ సమయంలోనూ అనేక పిటీషన్లకు అనుమతి ఇచ్చినట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
మధ్యంతర పిటీషన్లను అనుమతించరాదని సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే అభిప్రాయపడ్డారు. కొత్త అంశాలను ప్రశ్నిస్తే మాత్రమే కొత్త పిటీషన్లు స్వీకరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.