LOADING...
Supreme Court: '3నెలల్లో నిర్ణయం తీసుకోవాలి'.. ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. 
'3నెలల్లో నిర్ణయం తీసుకోవాలి'..

Supreme Court: '3నెలల్లో నిర్ణయం తీసుకోవాలి'.. ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 31, 2025
11:14 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పును వెల్లడించింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ అనర్హత పిటిషన్‌పై తీర్పు వచ్చిన తరువాత మూడు నెలల కాలంలో స్పీకర్ తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలని సీజే బీఆర్‌ గవాయ్‌ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఆదేశించింది. ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే అధికారాన్ని న్యాయస్థానానికి ఇవ్వాలన్న వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. "అపరేషన్ సక్సెస్.. పేషెంట్ డైడ్" అనే పరిస్థితి ఏర్పడకూడదని వ్యాఖ్యానిస్తూ, వ్యవస్థ ఆచరణలో సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరాన్ని సుప్రీం స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై పార్లమెంటు చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సుప్రీంకోర్టు సంచలన తీర్పు

వివరాలు 

10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ 

తమ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీలోకి మారిన కారణంగా వారికి అనర్హత ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై, స్పీకర్ నిర్ణయం తీసుకునేలా నిర్ణీత కాల పరిమితిలో ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్‌) నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే.టి.రామారావు (కేటీఆర్), ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్, గుండు జగదీశ్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్‌లు కలిసి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లు ఈ సంవత్సరం జనవరి 15న సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి.

వివరాలు 

ఏప్రిల్ 3న తుది తీర్పు రిజర్వ్ 

ఇప్పటివరకు తొమ్మిదిసార్లు ఈ కేసు విచారణకు వచ్చింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం,అన్ని పక్షాల వాదనలు శ్రద్ధగా విన్న తర్వాత, ఏప్రిల్ 3న తుది తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో ప్రతివాదులుగా తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌తోపాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలు పి. శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాలే యాదయ్య, తల్లగానా ప్రకాశ్‌గౌడ్, అట్లూరి గాంధీ, గూడెం మహిపాల్‌రెడ్డి, ఎం. సంజయ్‌కుమార్‌లను చేర్చారు. ఎన్నో నెలల పాటు సాగిన వాదనల అనంతరం ఈరోజు సుప్రీంకోర్టు తన తీర్పును వెల్లడించింది.