
AP DSC: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతుంది.. స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్), డీఎస్సీ (జనరల్ టీచర్ రిక్రూట్మెంట్) పరీక్షల నిర్వహణకు సంబంధించి స్పష్టత వచ్చింది.
ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీ షెడ్యూల్ యధావిధిగా కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ షెడ్యూల్ వాయిదా వేయాలని కోరుతూ ఆరుగురు అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే, వారు పేర్కొన్న కారణాల్లో తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ ధర్మాసనం ఆ పిటిషన్‌ను తిరస్కరించింది.
వివరాలు
జూన్ 6 నుండి జూలై 6 వరకు డీఎస్సీ
ఈ కేసును విచారించిన జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం, ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.
సుప్రీంకోర్టు నిర్ణయంతో టెట్, డీఎస్సీ షెడ్యూల్‌లకు మార్పులు లేకుండా యథావిధిగా కొనసాగనున్నాయి.
ఇకపోతే, రాష్ట్రంలోని మొత్తం 16,347 టీచర్ పోస్టుల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఏప్రిల్ 20న డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ఈ మేరకు జూన్ 6 నుండి జూలై 6 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షల (CBT) రూపంలో డీఎస్సీ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.