Page Loader
Sushil Modi: ఆరు నెలలుగా క్యాన్సర్ తో బాధపడుతున్న .. బీజేపీ నేత సంచలన ప్రకటన 
ఆరు నెలలుగా క్యాన్సర్ తో బాధపడుతున్న .. బీజేపీ నేత సంచలన ప్రకటన

Sushil Modi: ఆరు నెలలుగా క్యాన్సర్ తో బాధపడుతున్న .. బీజేపీ నేత సంచలన ప్రకటన 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 03, 2024
01:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీజేపీ నేత, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ కారణంగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కూడా తెలిపినట్లు సుశీల్‌ మోదీ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఆయన ఎక్స్‌ వేదికగా ఓ ట్వీట్‌ చేశారు.'నేను గత 6 నెలలుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నాను.ఇప్పుడు ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నాను. ఈ కారణంగా లోక్‌సభ ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు.ప్రధాని మోదీకి అన్ని విషయాలూ చెప్పాను. దేశం, బీహార్‌, పార్టీకి ఎల్లప్పుడూ అంకిత భావంతో పనిచేశాను. అందుకు కృతజ్ఞుతుడిని' అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 సుశీల్ కుమార్ మోదీ చేసిన ట్వీట్ 

Details 

నాలుగు సభలలో సభ్యుడుగా సుశీల్ మోదీ

సుశీల్ మోదీ చాలా కాలం పాటు (2005-2013, 2017-20)బీహార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. బీహార్ రాజకీయాల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. నితీష్‌తో అయన జోడీ చాలా స్పెషల్‌గా పరిగణించబడుతుంది. ఈ అనారోగ్యం కారణంగా కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయన ఈ విషయాన్ని చాలా కాలం పాటు దాచిపెట్టారు. ఇప్పుడు తనకు క్యాన్సర్ ఉందని చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా బీహార్ బీజేపీకి ఇది పెద్ద దెబ్బ. పార్టీలో ఆయన కార్యాచరణ చాలా ప్రత్యేకం. సుశీల్ కుమార్ మోదీ బీహార్ డిప్యూటీ సీఎంగానే కాకుండా రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. తన మూడు దశాబ్దాల ప్రజా జీవితంలో,అయన రాజ్యసభ,లోక్‌సభ,శాసన మండలి,శాసనసభతో సహా మొత్తం నాలుగు సభలలో సభ్యుడుగా ఉన్నారు.