
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు.. ఆంధ్రప్రదేశ్‌లో హై అలర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
అవినీతి ఆరోపణల కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఆంధ్రప్రదేశ్ పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేశారు.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు.
నంద్యాల పట్టణంలోని జ్ఞానపురంలోని ఆర్‌కే ఫంక్షన్ హాల్ నుంచి ఉదయం 6 గంటలకు మాజీ ముఖ్యమంత్రిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.
ఐపీసీ సెక్షన్ల సెక్షన్లు 120బీ (నేరపూరిత కుట్ర), 420 (మోసం చేయడం), 465 (ఫోర్జరీ) సెక్షన్ల కింద పోలీసులు అభియోగాలు మోపారు.
అంతేంకాకుండా ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు ఆయనపై అవినీతి నిరోధక చట్టాన్ని కూడా ప్రయోగించారు.
అరెస్టు చేసే ముందు సీఆర్‌పీ సెక్షన్ 50 (1) (2) కింద చంద్రబాబుకు నోటీసులను కూడా అందజేశారు.
చంద్రబాబు
నంద్యాలలో ఉదయం 3గంటల నుంచి హైడ్రామా
నంద్యాల రేంజ్ డీఐజీ రఘురామి రెడ్డి నేతృత్వంలోని పెద్ద సంఖ్యలో పోలీసులు, సీఐడీ అధికారులు తెల్లవారుజామున 3 గంటలకు పట్టణంలోని ఆర్‌కె ఫంక్షన్ హాల్‌లో వచ్చి చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఆయన తన కారవాన్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు.
అయితే అక్కడకు భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణుల నుంచి పోలీసులకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది.
ఈ క్రమంలో చంద్రబాబు సెక్యురిటీ అయిన ఎస్పీజీని కూడా పోలీసులను అనుమతించలేదు.
ఉదయం 6 గంటలకు చంద్రబాబు అరెస్టు చేసినట్లు అధికారులు ప్రకటించారు. చంద్రబాబును విజయవాడ తరలించి, అక్కడు కోర్టులో హాజరుపర్చనున్నారు.
చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. కీలక టీడీపీ నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అరెస్టుపై చంద్రబాబు స్పందన
నేను ఏ తప్పు చేయలేదు, కావాలని అరెస్ట్ చేశారు - నారా చంద్రబాబు నాయుడు గారు. pic.twitter.com/j20LRhcupn
— Hanu (@HanuNews) September 9, 2023