Page Loader
సబితను పార్టీలోకి తీసుకుని కేసీఆర్ తప్పు చేశారు.. టిక్కెట్ ఇవ్వకుంటే కారు దిగిపోతానన్న తీగల
టిక్కెట్ ఇవ్వకుంటే కారు దిగిపోతానన్న తీగల

సబితను పార్టీలోకి తీసుకుని కేసీఆర్ తప్పు చేశారు.. టిక్కెట్ ఇవ్వకుంటే కారు దిగిపోతానన్న తీగల

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 28, 2023
10:45 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంటోంది. అసంతృప్త నేతలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే, హైదరాబాద్‌ మాజీ మేయర్‌ బీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి సీఎం కేసీఆర్ తీరుపై గుర్రుగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో తనకు మహేశ్వరం అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాలని, లేకుంటే పార్టీని వీడతానని స్పష్టం చేశారు. ఇప్పటికే తమ కోడలు డా.అనితా రెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌ పర్సన్‌గా ఉండటం కారణంగా ఒకే ఇంట్లో 2 పదవులు అంటున్నారని తీగల అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తాను కేసీఆర్‌ సమకాలికుడినని, రాజకీయాల్లో ఆయతో సమానంగా ఉన్నానని తీగల చెప్పుకుంటున్నారు.

DETAILS

సబితను పార్టీలోకి తీసుకుని కేసీఆర్ తప్పు చేశారు : తీగల

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఎందరో నాయకులు పార్టీ కోసం విశేషంగా పనిచేశారని తీగల కృష్ణారెడ్డి గుర్తు చేశారు. అయితే వారందరికీ బీఆర్ఎస్ లో సరైన గౌరవం, గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ నాయకులతో అధిష్ఠానం చర్చించాలని, లేకుంటే తమ దారి తాము చూసుకుంటామని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సబిత ఇంద్రారెడ్డిని పార్టీలోకి తీసుకుని మంత్రి పదవి కట్టబెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇతర పార్టీల నేతలకు బీఆర్ఎస్ లో ప్రాధాన్యం ఇచ్చి కేసీఆర్ తప్పు చేశారనన్నారు. తనకు మాత్రం వచ్చే ఎన్నికల్లో మహేశ్వరం సీట్ ఇవ్వాలని, లేని పక్షంలో పార్టీకి రాజీనామా చేస్తానని తీగల స్పష్టం చేశారు.