Page Loader
Rain Alert: నైరుతి రుతుపవనాలు,అల్పపీడనం,ద్రోణి ప్రభావంతో .. 3 రోజులు నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో..
నైరుతి రుతుపవనాలు,అల్పపీడనం,ద్రోణి ప్రభావంతో .. 3 రోజులు నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలు..

Rain Alert: నైరుతి రుతుపవనాలు,అల్పపీడనం,ద్రోణి ప్రభావంతో .. 3 రోజులు నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో..

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2025
05:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

నైరుతి రుతుపవనాలు, అల్పపీడన స్థితి, రుతుపవన ద్రోణి ప్రభావంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ కీలక హెచ్చరికను జారీ చేసింది. వచ్చే మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో తక్కువ నుండి భారీ వర్షాలు పడే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. ఉరుములు,మెరుపులతోపాటు బలమైన ఈదురుగాలులు కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. వాతావరణ కేంద్రం ప్రకారం, ప్రస్తుత ద్రోణి ఈశాన్య అరేబియా సముద్రం నుంచి పశ్చిమ బెంగాల్ లోని గంగా నది పరిసర ప్రాంతాల వరకూ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

వివరాలు 

వాతావరణ సూచనలు - ప్రాంతాల వారీగా 

ఇది దక్షిణ గుజరాత్, ఉత్తర మధ్య మహారాష్ట్ర, విదర్భ, దక్షిణ ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశా మీదుగా 4.5 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. అంతేగాక, ఆంధ్రప్రదేశ్, యానాం మీదుగా దిగువ ట్రోపోస్ఫియరిలో నైరుతి మరియు పశ్చిమ గాలులు వీస్తున్నాయని పేర్కొంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ - యానాం: మంగళవారం, బుధవారం: కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 40-50 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయి. గురువారం: ఒకటి లేదా రెండుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతోపాటు అదే స్థాయిలో గాలులు కూడా ఉంటాయి.

వివరాలు 

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్: 

మంగళవారం, బుధవారం: ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40-50 కిమీ వేగంతో గాలులు వీస్తాయని అంచనా. గురువారం: కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలుల వేగం ఇదే స్థాయిలో కొనసాగే అవకాశముంది. రాయలసీమ: మూడు రోజులు (మంగళవారం-గురువారం): ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 40-50 కిమీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

వివరాలు 

తెలంగాణలో భారీ వర్షాల సూచన 

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు తక్కువ నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో మాత్రం గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులతో కూడిన తీవ్రమైన వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది.