Telangana: ఈ నెల 6న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
ఈ వార్తాకథనం ఏంటి
బడ్జెట్ సమావేశాలు దగ్గరపడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకునే దిశగా చర్యలు చేపడుతోంది.
ఈ నేపథ్యంలో ఈనెల 6న క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరుగనుంది.
ఈ సమావేశంలో ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించనున్నారు.
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులపై చర్చించిన విషయం తెలిసిందే.
ఆ ప్రాజెక్టుల గురించి ఈ క్యాబినెట్ సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నారు.
వివరాలు
మహిళలకు లబ్ది చేకూరేలా కొత్త పథకాలు
అలాగే, మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు లబ్ది చేకూరేలా కొత్త పథకాలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఈ సమావేశంలో ఆయా పథకాల గురించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోనుంది. ఈనెల రెండో వారంలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఉన్న అంశాల గురించి కూడా సమావేశంలో కీలక చర్చ జరుగనుంది.
ముఖ్యంగా, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న బీసీ రిజర్వేషన్ల బిల్లును బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించనున్నారు.
ఈ బిల్లుకు పార్లమెంటరీ చట్టబద్ధత కల్పించి, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ధృడంగా సంకల్పించింది.