తదుపరి వార్తా కథనం

Telangana: తెలంగాణ కాంగ్రెస్ పెద్దలకు పార్టీ అధిష్టానం నుంచి పిలుపు
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 24, 2025
12:24 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వంలో లేదా కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయా? అంటే అవుననే ప్రచారం వినిపిస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీకి పయనమవుతారని సమాచారం.
తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలు సాయంత్రం పార్టీ ప్రధాన నాయకుడు కేసీ వేణుగోపాల్‌తో భేటీ కానున్నారు.
అలాగే,ఈరోజు,రేపు ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఇతర పార్టీ పెద్దలతో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
వీరు ఢిల్లీకి వెళ్లనున్నారని సమాచారం రాగానే, తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.