Revanth Reddy: దేశానికే ఆదర్శంగా తెలంగాణ.. 55,143 ఉద్యోగాలు భర్తీ
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ రాష్ట్రం నుంచి అత్యధిక మంది ఐఏఎస్‌లు వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాభవన్‌లో నిర్వహించిన 'రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
సివిల్స్ మెయిన్స్ ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు ఎంపికైన 20 మంది అభ్యర్థులకు ఆర్థిక సాయం అందజేశారు. ప్రతి అభ్యర్థికీ రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేశారు.
బిహార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్లనే ఎక్కువ మంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు వస్తున్నారని, ఆ రాష్ట్రం తెలంగాణకు స్ఫూర్తిగా నిలుస్తోందని తెలిపారు.
సింగరేణి సంస్థ ద్వారా సివిల్స్ అభ్యర్థులకు సాయం అందిస్తున్నట్లు చెప్పారు. ఇది ఆర్థిక సాయం కాదని, ప్రోత్సాహకంగా భావించాలని సూచించారు.
Details
ఖాళీలను భర్తీ చేస్తున్నాం
అభ్యర్థులంతా సివిల్స్‌లో విజయాన్ని సాధించి తెలంగాణకే సేవ చేయాలని ఆకాంక్షించారు.
తెలంగాణ అధికారులు కేంద్రంలో ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాదిలో 55,143 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.
ఇది దేశంలోనే రికార్డు అని చెప్పారు. గత పదేళ్లలో మిగిలినపోయిన ఖాళీలను ఇప్పుడు భర్తీ చేస్తున్నామన్నారు.
గతంలో ఎప్పుడూ 563 గ్రూప్ 1 ఉద్యోగాలను విడుదల చేయలేదని ఆయన స్పష్టం చేశారు.