Page Loader
జమ్మూకశ్మీర్: బారాముల్లాలో భీకర ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం
బారాముల్లాలో భీకర ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం

జమ్మూకశ్మీర్: బారాముల్లాలో భీకర ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 16, 2023
02:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్మూకశ్మీర్ లో శనివారం భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు ఉగ్రవాదులకు, కేంద్ర భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది మరణించాడు. ఉరి, హత్లాంగా ఫార్వర్డ్ ఏరియాలో ఉగ్రవాదులకు, ఆర్మీ, బారాముల్లా పోలీసుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ క్రమంలోనే కాశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. బారాముల్లాలో ఉగ్రవాదులు జాడ కోసం భద్రతా బలగాల గాలింపు కొనసాగుతోంది. గత 4 రోజులుగా కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. ఉగ్రవాదుల ఆచూకీ కోసం డ్రోన్‌తో నిఘా పెట్టారు.త్వరలోనే ఉగ్రవాదులను అంతంచేస్తామని లోయ పోలీసులు పేర్కొన్నారు. అనంత్ నాగ్ ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ విస్తృతంగా కొనసాగుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బలగాల చేతిలో ఉగ్రవాది హతం