Page Loader
శివసేన: ఎమ్మెల్యేల అనర్హతపై గడువు విధించాలని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఆదేశం 
శివసేన: ఎమ్మెల్యేల అనర్హతపై గడువు విధించాలని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ను సుప్రీంకోర్టు ఆదేశం

శివసేన: ఎమ్మెల్యేల అనర్హతపై గడువు విధించాలని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఆదేశం 

వ్రాసిన వారు Stalin
Sep 18, 2023
07:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేతో సహా 56మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్‌పై వారం రోజుల్లోగా విచారణ జరిపేందుకు గడువు విధించాలని అసెంబ్లీ స్పీకర్‌ను సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ఈ మేరకు స్పీకర్ రాహుల్ నార్వేకర్‌కు సుప్రీంకోర్టు సీజేఐ డివై చంద్రచూడ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 4నెలల్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తనను సూచించింది. శివసేనలోని రెండు వర్గాలైన ఏక్‌నాథ్ షిండే, ఉద్ధవ్ థాకరే శిబిరాలు ఒకరిపై ఒకరు అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీలో శివసేన రెండు వర్గాలకు కలిపి 56 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 56మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు మొత్తం 34 పిటిషన్లు దాఖలు చేసుకున్నాయని ధర్మాసనం పేర్కొంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అనర్హతపై మొత్తం 34 పిటిషన్లు దాఖలు