Page Loader
PM Modi : కింగ్ చార్లెస్ III త్వరగా కోలుకోవాలి.. ప్రధాని మోదీ ఆకాంక్ష 
PM Modi : కింగ్ చార్లెస్ III త్వరగా కోలుకోవాలి.. ప్రధాని మోదీ ఆకాంక్ష

PM Modi : కింగ్ చార్లెస్ III త్వరగా కోలుకోవాలి.. ప్రధాని మోదీ ఆకాంక్ష 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 06, 2024
12:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్యాన్సర్‌తో బాధపడుతున్న బ్రిటన్ రాజు 3వ చార్లెస్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. "హిస్ మెజెస్టి కింగ్ చార్లెస్ III త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యాన్ని కోరుకోవడంలో నేను భారతదేశ ప్రజలతో కలిసి ఉన్నాను" అని ప్రధాన మంత్రి X లో రాశారు. బ్రిటన్ రాజభవనం బకింగ్‌హామ్ ప్యాలెస్ బ్రిటన్ రాజు చార్లెస్ III క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. జనవరిలో 75 ఏళ్ల కింగ్ చార్లెస్ మూడు రోజుల పాటు ఆస్పత్రిలో ప్రోస్టేట్ సమస్య కోసం చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో వైద్యులు చేసిన పరీక్షల్లో శరీరంలో క్యాన్సర్ కణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించినట్లు ప్యాలెస్ వెల్లడించింది.

Details 

చార్లెస్ త్వరగా కోలుకోవాలి: సునక్, బైడెన్ 

చార్లెస్- III ఆరోగ్యంపై దేశాధినేతలు స్పందించారు. కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలని యూకే ప్రధాని రిషి సునక్ కూడా ఆకాంక్షించారు. చార్లెస్ మళ్లీ మామూలు మనిషి కావాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒక ప్రకటన విడుదల చేసారు. క్వీన్ ఎలిజబెత్ మరణం తరువాత నవంబర్ 2022 లో రాజుగా చార్లెస్‌కు పట్టాభిషేకం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రధాని మోదీ చేసిన ట్వీట్