బెంగళూరు-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే రూట్ ఖారారు
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరు-హైదరాబాద్ మధ్య తరచుగా ప్రయాణించే వారికి ఇది శుభవార్త లాంటిదే.
రెండు ఐటీ నగరాలను కలిపేందుకు త్వరలో రైల్వే శాఖ బెంగళూరు-సికింద్రాబాద్ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది.
బెంగళూరు-హైదరాబాద్ మధ్య నడిచే రైలు గురించి ఇప్పటికే ప్రధాని మోదీ తెలంగాణ బీజేపీ నాయకులతో చెప్పినట్లు గతలోనే వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా బెంగళూరు-హైదరాబాద్ మధ్య నడిపే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను కూడా రైల్వే శాఖ దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఈ రైలును కాచిగూడ- బెంగళూరు మార్గంలో నడిపేందుకు రైల్వేశాఖ సిద్ధమైనట్లు సమాచారం. అందుకే ఈ రూట్లో ట్రాక్ సామర్థ్యం, ఇతర సౌకర్యాలపై అధికారులు దృష్టి సారించారు.
వందేభారత్
7గంటల్లోనే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లొచ్చు
బెంగళూరు-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభమైతే తెలంగాణకు ఇది మూడో ట్రైన్ అవుతుంది.
ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్టణం , సికింద్రాబాద్-తిరుపతి రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారు.
త్వరలోనే మూడో రైలును ప్రారంభించేందుకు మళ్లీ నరేంద్ర మోదీ హైదరాబాద్ రానున్నట్లు సమాచారం.
ఈ ట్రైన్ అందుబాటులోకి వస్తే కేవలం ఏడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చేరుకోవచ్చు. ఇతర రైళ్లు అయితే 11గంటలకుపైగా సమయం పడుతుంది.
బెంగళూరు-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును వచ్చే నెల 21న ప్రారంభిస్తారని ప్రచారం జరుగుతోంది.
ఈ ఏడాది చివరి నాటికి 75 వందేభారత్ రైళ్లను నడపాలని, వచ్చే మూడేళ్లలో 400 రైళ్లను నడపాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.