Supreme Court On pollution: వాయుకాలుష్యం అరికట్టడానికి తీసుకున్న చర్యలపై అఫిడవిట్‌లు దాఖలు చెయ్యండి.. 5 రాష్ట్రాలను కోరిన సుప్రీం
వాయు కాలుష్య నియంత్రణకు తీసుకున్న చర్యలను తెలుపుతూ అఫిడవిట్లు దాఖలు చేయాలని పంజాబ్,దిల్లీ,హర్యానా,యూపీ,రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. వారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని జస్టిస్ ఎస్‌కే కౌల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. న్యాయమూర్తులు సుధాన్షు ధులియా,పికె మిశ్రా దేశ రాజధానిలో వాయు కాలుష్యానికి పంటను తగలబెట్టడం కూడా ప్రధాన కారణం అన్నారు. అంతకుముందు,ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలలో కాలుష్యాన్ని అరికట్టడానికి తీసుకున్న చర్యలపై ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్(సిఎక్యూఎం)నుండి సుప్రీం కోర్టు నివేదిక కోరింది. ముప్పును అరికట్టడానికి చర్యలు తీసుకున్నప్పటికీ ఢిల్లీ, దేశంలోని ఇతర ప్రాంతాలు ముఖ్యంగా ఉత్తరాన వాయు కాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్నాయి. పంజాబ్‌లో ఆదివారం నాడు 1,068 పొలాల్లో మంటలు చెలరేగడం అనేది ఈ సీజన్‌లో ఒక రోజులో అత్యధికం.