భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం; 2024లో ఐఎస్ఎస్‌కి జాయింట్ ఆస్ట్రోనాట్ మిషన్
ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా భారత్, అమెరికా మధ్య అంతరిక్ష పరిశోధనకు సంబంధించి గురువారం మరో కీలక ఒప్పందం కుదిరింది. రెండు దేశాలు 2024లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి సంయుక్త వ్యోమగామి మిషన్‌ను చేపట్టేందుకు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా), ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మధ్య ఒప్పందం కుదిరినట్లు వైట్‌హౌస్ తెలిపింది. సివిల్ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్‌లో సమాన ఆలోచనలు ఉన్న దేశాలను ఏకతాటిపైకి తీసుకొచ్చే ఆర్టెమిస్ ఒప్పందంలో భారత్ కూడా చేరాలని నిర్ణయించింది. ఆర్టెమిస్ అంటే చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు ఉద్దేశించి అమెరికా తయారు చేసిన ఒప్పందం. ఈ ఒప్పందం ద్వారా భారత వ్యోమగామి తొలిసారిగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వద్దకు వెళ్లనున్నారు.