Year Ender 2024: ఈ ఏడాది అద్భుతమైన విజయాలు, గుండెలను కదిలించిన విషాదాలివే..!
ఈ వార్తాకథనం ఏంటి
భారతావని 2024లో ఎన్నో ముఖ్య ఘట్టాలు చూసింది.
అయోధ్యలో శతాబ్దాల కల సాకారం కావడం నుంచి లోక్‌సభ ఎన్నికల అంచనాలు తారుమారవడం వరకూ, సత్యం, విజయం, విషాదం కలబోసిన ఒక విభిన్న సంవత్సరం గడిచింది.
ఇస్రో విజయాలు దేశానికి గర్వకారణమయ్యాయి. అయితే ప్రకృతి విపత్తులు, చట్టపరమైన మార్పులు, అనేక సంఘటనలు ప్రజల మనసులను కలచివేశాయి.
అయోధ్యలో రామమందిరం
శతాబ్దాల కలను సాకారం చేస్తూ అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం జనవరిలో ఘనంగా జరిగింది. భక్తుల కళ్లను ఆనందంతో నింపుతూ బాల రాముని భవ్య రూపం అన్ని వైపులా విశేష ప్రసిద్ధి చెందింది.
Details
ఇస్రో విజయాలు
2024 ప్రారంభంలోనే ఇస్రో కృష్ణబిలాలు, ఎక్స్ కిరణాలపై అధ్యయనానికి 'ఎక్స్‌రే పొలారీమీటర్ శాటిలైట్' ప్రయోగం విజయవంతంగా నిర్వహించింది.
అదితి ఎల్-1 ప్రయోగం కూడా శాస్త్రజ్ఞుల ప్రతిభకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.
లోక్‌సభ ఎన్నికలు
బీజేపీ హ్యాట్రిక్ సాధించినప్పటికీ మెజారిటీకి కాస్త దూరంలో నిలిచింది. విపక్ష ఇండియా కూటమి కొంత మెరుగైన ప్రదర్శన చేసింది.
రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కాంగ్రెస్ పార్టీకి ఊపునిచ్చింది. అయితే ఆరాజకీయ పరిస్థితులు మిశ్రమ ఫలితాలు చూపించాయి.
వయనాడ్ ప్రకృతి విపత్తు
కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 231 మంది అమాయకుల ప్రాణాలు బలయ్యాయి. ప్రకృతి పట్ల నిర్లక్ష్యం ఎంతటి దారుణానికో ఈ ఘటన స్పష్టంగా తెలియజేసింది.
Details
2024లో ప్రముఖులు అస్తమయం
రతన్ టాటా, మన్మోహన్ సింగ్, జాకీర్ హుస్సేన్, శ్యామ్ బెనగల్ వంటి దిగ్గజాలను దేశం కోల్పోయింది. వీరి అస్తమయం దేశానికి తీరని లోటు.
సీఏఏ అమలు
పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
చదరంగంలో గుకేశ్ విజయం
18 ఏళ్ల గుకేశ్ దొమ్మరాజు ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. డింగ్ లిరెన్‌ను ఓడించి, భారత చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని రాసాడు.
న్యాయ వ్యవస్థలో మార్పులు
భారత శిక్షాస్మృతులు, సాక్ష్య చట్టాలు స్థానంలో నూతన న్యాయ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. వేగవంతమైన న్యాయం, ఆన్‌లైన్ ఫిర్యాదుల ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది.
Details
ఆర్‌జీ కర్ వైద్య కళాశాల ఘటన
కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ వైద్యురాలిపై జరిగిన దారుణ హత్యాచారం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. దేశవ్యాప్తంగా మహిళల భద్రత పట్ల నిరసనలు వెల్లువెత్తాయి.
రైతుల పోరాటం
మద్దతు ధరకు చట్టబద్ధత కోరుతూ పంజాబ్, హరియాణా రైతులు మరోసారి ఉద్యమ బాట పట్టారు. ఈ పోరాటం రైతుల హక్కుల కోసం కొనసాగుతున్న సమరాన్ని మరోసారి చాటిచెప్పింది.
ముగింపు
2024లో భారతావనికి అనేక కీలక మార్పులు ఎదురయ్యాయి. ఒకవైపు విజయగాధలు, మరొకవైపు విషాద సంఘటనలు. దేశం ఎదుగుదల, సవాళ్లు, నూతన అవకాశాలను కలసికట్టుగా ఎదుర్కొంది.