
Indian Railways: భారత్ - పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో.. భారతీయ రైల్వే కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, పరిణామాలు ఆందోళనకరంగా మారుతున్నాయి.
భారత సైన్యం చేపట్టిన మెరుపు దాడులతో పాకిస్థాన్ గట్టిగా షాక్‌కు గురై, తన ఉనికిని రుజువు చేసేందుకు అన్ని మార్గాలలో ప్రయత్నాలు చేస్తోంది.
ముఖ్యంగా జమ్ముకశ్మీర్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో స్థానిక ప్రజల భద్రత కోసం అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండటంతో, అక్కడ నివసిస్తున్న వారు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో,భారతీయ రైల్వే ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
వివరాలు
సరిహద్దుకు సమీపంలో విద్యుత్ నిలిపివేసి బ్లాక్‌అవుట్ అమలులోకి..
జమ్మూ, ఉధంపుర్ ప్రాంతాల నుంచి దేశ రాజధాని దిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లను ప్రారంభించేందుకు యోచిస్తోంది.
దేశ సరిహద్దుల్లో నెలకొన్న అస్థిరతను, ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
'ఆపరేషన్ సిందూర్' తర్వాత సరిహద్దు పరిస్థితులు మరింత ఉద్రిక్తతను సంతరించుకున్నాయి.
పాకిస్థాన్ ప్రయోగించిన ఎనిమిది మిసైళ్లను భారత సైన్యం సమర్థంగా నిరోధించి, వాటిని గాలిలోనే ఛేదించింది.
జమ్మూ జిల్లాలో మోతాదైన భద్రత చర్యలలో భాగంగా అలర్ట్ సైరన్లు వినిపించాయి.
ప్రజలు బయటకు రావద్దని, ఇంటి లోపలే ఉండాలని భారత సైన్యం హెచ్చరికలు జారీ చేసింది.
అంతేకాదు, సరిహద్దుకు సమీపంలోని కొన్ని నగరాల్లో విద్యుత్ నిలిపివేసి బ్లాక్‌అవుట్ అమలులోకి తెచ్చారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
భారతీయ రైల్వే కీలక నిర్ణయం
भारतीय रेलवे ने जम्मू और उधमपुर से दिल्ली के लिए तीन विशेष ट्रेनें चलाने का निर्णय लिया है। यह कदम वर्तमान हालात को ध्यान में रखते हुए यात्रियों की सुरक्षा और सुविधा सुनिश्चित करने के लिए उठाया गया है। टिकट IRCTC वेबसाइट और रेलवे काउंटर से बुक करें।#IndianRailways… pic.twitter.com/SBqnwY251k
— Bharatwide News Network (@BharatwideNews) May 9, 2025